( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .

తెలంగాణలో వ‌రుస పెట్టి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ వెంట‌నే మే నెల‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు కూడా జ‌రిగాయి. పార్ల‌మెంటు ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా లోని స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత కె. కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేశ‌వ రావు పార్టీ మార‌డంతో పాటు త‌న రాజ్య‌స‌భ ప‌ద‌వి కూడా వ‌దులుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఆ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఈ ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నిక కోసం ఆగస్టు 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ నిర్వ‌హిస్తారు. అనంత‌రం నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీలు కాగా.. వ‌చ్చే సెప్టెంబర్ 3నఈ ఎన్నిక జరగనుంది. అదేరోజు ఎన్నికల ఫలితాలను ఈసీ విడుదల చేయనుంది. తెలంగాణ లో జ‌రిగే ఈ ఒక్క స్థానంతో  పాటు మిగతా 11 స్థానాలకు షెడ్యూల్ ను విడుదల చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరగనుంద‌ని చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ లో మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు.


దీనికి తోడు బీఆర్ ఎస్ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేప‌థ్యంలో నే ఇప్పుడు ఈ స్థానంలో బీఆర్ ఎస్ నుంచి పోటీ లేకుండానే కాంగ్రెస్ గెల‌వ‌నుంది. దీంతో రాజ్య‌స‌భ లో మరో సీటు కాంగ్రెస్ ఖాతాలో పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: