ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పైన అలాగే ఏపీ సీఎం చంద్రబాబు పైన నిన్నటి రోజున కోర్టును సైతం ఆశ్రయించారు.. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటూ చెడిపోయిన వాహనాలను కూడా ఇస్తూ ఉన్నారట. అలాగే మాజీ సీఎంకు భద్రత కుదింపు పైన కూడా జగన్ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ రోజున విచారణ కూడా జరిపించినట్లు తెలుస్తోంది. జగన్ భద్రత విషయంలో రాజీ పడవద్దు అంటూ కూడా హైకోర్టు కూడా ఆదేశాలను జారీ చేసింది. ఇంకా వాదోపవాదములు వినిపిస్తూనే ఉన్నాయి.


ఇలాంటి సమయంలోనే ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే గతంలో ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్.. గతంలో ప్రచారంలో భాగంగా భద్రతలను సైతం ఇచ్చిన విషయాన్ని ఇప్పుడు చాలా మంది వైసిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఫోటోలను షేర్ చేస్తూ టిడిపిని ట్రోల్ చేస్తున్నారు... ముఖ్యంగా ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు కనీసం వార్డ్ మెంబర్గా కూడా లేని లోకేష్ కు అప్పట్లో ఎలాంటి భద్రత ఇచ్చారో చూడండి  అంటూ పలువురు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నారు.


ఎలాంటి అర్హతలేని లోకేష్ కి అప్పుడు అలాంటి భద్రత ఇచ్చినప్పుడు ప్రస్తుతం 40% ఓటింగ్ ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రతను తగ్గించడం తగువేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.ముఖ్యంగా సీఎం గా ఉన్నప్పుడే చాలా మంది జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయించడం జరిగింది. ఇప్పుడు అలాంటిది ప్రాణహాని ఉన్నది అంటూ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కోర్టు మెట్లు కూడా ఎక్కారు. మరి ఈ విషయం పైన పలువురు  కూడా జగన్ కి ఒక న్యాయము లోకేష్ కి ఒక న్యాయమా అంటూ పలువురు నేటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: