ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్సై రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం పార్వతీపురం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున విజయం సాధించారు బోనెల విజయచంద్ర. 24 వేల మెజారిటీతో ఎమ్మెల్యే అయిన విజయ్ చంద్రకు జనంతో ఎలా కలిసిపోవాలో ఇంతవరకు అర్థం కాలేదట. రకరకాల సమస్యలతో వాటి పరిష్కారం కోసం గంపెడు ఆశలతో అతని వద్దకు వెళుతున్న వారి కోసం ఎన్నో ఆంక్షలు పెడుతున్నారట విజయేంద్రప్రసాద్.


కూటమి ప్రభుత్వం పవర్ లో ఉంది కాబట్టి టీడీపీతో పాటు అటు జనసేన బీజేపీ నాయకులు కూడా వివిధ రకాల సమస్యలను తీసుకొని ఎమ్మెల్యే దగ్గరకు వస్తున్నా ఆయన మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగా ప్రచారం మొదలైంది. గెలిచింది మొదలు ఈ రెండు నెలల్లో వరుసగా ఓ పది రోజులు నియోజకవర్గంలో ఉన్నది లేదట. వారంలో నాలుగు రోజులు పార్వతీపురంలో ఉంటే మరో మూడు రోజులు విశాఖకు... లేదంటే విజయవాడకు వెళ్తున్నారని లోకల్ సర్కిల్స్ లో టాక్.


పైగా ఆ ఉన్న నాలుగు రోజులు కూడా అతని వద్దకు వెళ్లి కలుద్దామా అంటే అందుకు కూడా షరతులు వర్తిస్తాయని చెబుతున్నారట. ఉదయం 8 గంటల తర్వాత సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే తనను కలవడానికి రావాలని అపాయింట్మెంట్స్ ఇస్తున్నారట. అతను చెప్పిన టైమ్ కి ఒక్క నిమిషం అటు ఇటు అయినా కూడా నో అపాయింట్మెంట్ అంటూ ఆఫీసర్ లాగా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.


ఆయన రెగ్యులర్ గా నియోజకవర్గంలో ఉంటూ ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుంటే పరవాలేదు.... అలా కాకుండా పార్ట్ టైం జాబ్ లాగా వచ్చి వెళుతూ ఉండడం, మళ్ళీ అందులోను షరతులు అంటే ఎలా... అందుకేనా అంత కష్టపడి ఇతడిని గెలిపించింది అని సొంత కార్యకర్తలే చిరాకు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నారై సార్ కి ఇంకా ఇండియన్ పాలిటిక్స్ అర్థం కాలేదా అని సెటైర్స్ సైతం వేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: