సాధారణంగా రాయలసీమ జిల్లాలు అంటే వైసీపీ అనుకూల జిల్లాలు అని అందరూ భావిస్తారు. రాయలసీమ జిల్లాల్లో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. ఈ రెండు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ హవా నడిచింది. ఉమ్మడి కడప జిల్లాలో అయితే అభ్యర్థుల ఎంపికతో సంబంధం లేకుండా జగన్ ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే వాళ్లే విజయం సాధించేవారని అందరూ నమ్ముతారు. అయితే 2024 ఎన్నికల ఫలితాలు ఈ లెక్కల్ని మార్చేశాయి.
 
2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ పోటీ చేశారు. రాజకీయాల కోసం ఆయన తన పదవికి స్వచ్చంద పదవీ విరమణ చేయడం జరిగింది. సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా గతంలో ఇంతియాజ్ పని చేశారు. అయితే కర్నూలు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది.
 
ఎన్నికల ఫలితాల తర్వాత ఇంతియాజ్ కర్నూలులో పెద్దగా యాక్టివ్ గా లేరని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో తెలియాల్సి ఉంది. జగన్ ను నమ్మి ఇంతియాజ్ నిండా మునిగారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతియాజ్ ఒకవైపు ఉద్యోగానికి దూరమయ్యారని మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
2019 నుంచి 2024 వరకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. హఫీజ్ ఖాన్ వైసీపీ తరపున 2019లో గెలవగా ఐదేళ్లలో మారిన పొలిటికల్ పరిస్థితులు, ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఇంతియాజ్ కు అనుకూల ఫలితాలు రాలేదని చాలామంది భావిస్తారు. నియోజకవర్గంలో ఎంత కష్టపడినా ఇప్పట్లో వైసీపీ పుంజుకోవడం సాధ్యం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న ఇంతియాజ్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: