- సిక్కోలు సింహం చల్లబడింది..
- ఓటమెరుగని ధర్మాన ప్రసాదరావు..
- వైసీపీకి హ్యాండిస్తున్నారా...


 రాజకీయాలు అంటేనే గాల్లో దీపం పెట్టి ఎదురుచూడడం. ఎలక్షన్స్ జరిగి  ప్రజలు మన్నిస్తే గెలిచినట్టు, లేదంటే ఓడినట్టే. అలా రాజకీయాల్లో  మార్పులు చేర్పులు అనేవి సహజం. కానీ కొంతమంది రాజకీయ నేతలు మాత్రం  ఎప్పుడు కూడా ఓటమిని ఎరుగరు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధర్మాన ప్రసాదరావు. అలాంటి ధర్మాన ఈసారి దారుణంగా ఓటమిని చవిచూసారు.  దీంతో ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పే పంథాతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 ధర్మాన దారెటు:
ఒకప్పుడు చుట్టూ అనుచర గణం చుట్టూ అధికారులతో బిజీగా ఉండే ధర్మాన  ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను మొత్తం కూటమి అభ్యర్థులే గెలుచుకున్నారు. దీంతో వైసిపి నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇక ఫ్యాన్ పార్టీ లో ఉండాలా లేకపోతే వెళ్లిపోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు సీనియర్లు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. కాంగ్రెస్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి,వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి,  రోశయ్య క్యాబినెట్లలో కూడా కీలక మంత్రి పదవులు పొందారు. అలాగే జగన్ మంత్రివర్గంలో కూడా రెవెన్యూ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అలా ఎంతో సీనియారిటీ ఉన్న ఈయన పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. ముందుగా నరసన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈయన ఆ తర్వాత శ్రీకాకుళం షిఫ్ట్ అయ్యారు. 


ఇక 2024 ఎలక్షన్స్ లో తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఓడిపోయారు. సాధారణ టిడిపి కార్యకర్త కొండి శంకర్ పై 53000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఎంతో మదన పడుతున్నటువంటి ధర్మాన ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారట.   ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటినుంచి ధర్మాన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ చాలా సైలెంట్ అయిపోయారు. అయితే మొన్నటి ఎలక్షన్స్ లోనే తన కుమారుడు రామ్మోహన్ నాయుడుకి టికెట్ ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు జగన్ ని ఆయన కోయారట. కానీ జగన్ స్పందించకపోవడంతో అప్పటినుంచి జగన్ పై కాస్త గుర్రుగా ఉన్నారు ధర్మాన.. దీంతో కుమారుడుని పొలిటికల్ ఎంట్రీ చేయించి తాను సైలెంట్ గా ఉండాలని ధర్మాన ఫిక్స్ అయ్యారట. దీనిపై జగన్ తో కూడా చర్చించడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ధర్మాన  ప్రసాద్ రావు రాజకీయా సన్యాసం తీసుకోవాలని చూస్తున్నట్టు లోకల్ కార్యకర్తల్లో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: