ప్రత్యేక తెలంగాణ కోసం కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాలు ఒక ఎత్తు అయితే కెసిఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన పోరాటం మరో ఎత్తు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. వరుసగా రెండు ఎన్నికలలో గెలిచింది. కేసీఆర్ పదేళ్లపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించి ఎన్నికల్లోకి వెళ్ళింది.. ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఒక్క ఓటమి దెబ్బకు బిఆర్ఎస్ పూర్తిగా డీలాపడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు.


తాజాగా బీఆర్ఎస్ బిజెపిలో విలీనం కాబోతుందంటూ వస్తున్న కథనాలు తెలంగాణలో మాత్రమే కాదు జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో కలిపేస్తున్నారు.. కుమార్తె కవితను.. తనను కాపాడుకోవడానికి కేసీఆర్ చేస్తున్న సరికొత్త రాజకీయం ఇది అని కూడా చర్చలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేసిన దగ్గర నుంచి కేసీఆర్ ఒకరకంగా నరకం చూస్తున్నారని చెప్పాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవటమే జీర్ణించుకోలేని కేసీఆర్కు కవిత అరెస్టుతో పాటుగా తనను కూడా అరెస్టు చేస్తారని వార్తలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.


ఇప్పుడే కేసీఆర్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి.. తనను తాను కాపాడుకోవాలి.. తన కుమార్తెను జైలు నుంచి బయటకు తీసుకురావాలి. అందుకే కేసిఆర్ నానా తంటాలు పడుతున్నారు.. కొడుకు కేటీఆర్ తో పాటు మేనల్లుడు హరీష్ రావును పదేపదే ఢిల్లీ పంపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా బిజెపితో విలీనం అనే మాట మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పదే పదే మోడీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్ ఇప్పుడు అదే బిజెపితో సఖ్యత కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.


బిజెపి పెద్దలు కూడా ఎట్టి పరిస్థితులలోనూ కేసీఆర్‌ను నమ్మరు. అందుకే కేసిఆర్ చివరకు తన పార్టీని బిజెపిలో విలీనం చేసే దిశగా కూడా ఢిల్లీలో ఉన్న బిజెపి పెద్దలకు కేటీఆర్ - హరీష్ ద్వారా హామీలు ఇప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ? కూడా అర్థం కాని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: