ఏపీ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా బాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి 19 వేల రూపాయలకు సరఫరా అవుతున్న టెనెక్ట్ ప్లేస్ ను ఇకపై ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సీ.హెచ్.సీ, ఏరియా ఆస్పత్రులను వైద్య కాలేజీలతో అనుసంధానించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయనుందని తెలుస్తోంది.
ఐ.సీ.ఎం.ఆర్, ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాల మేరకు అవసరమైన వాళ్లకు ఖరీదైన టెనెక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ ఇస్తున్నారని సమాచారం అందుతోంది. ఎవరికైనా గుండె సమస్య వచ్చిన సమయంలో చిన్న ఆస్పత్రులకు వెళ్తే అక్కడ ఈసీజీ తీసి పెద్ద ఆస్పత్రికి పంపడం జరుగుతుంది. ఉన్నత వైద్య నిపుణులు రోగులకు ఇంజెక్షన్ అవసరం అయితే ఆ ఇంజెక్షన్ ను సూచించడం జరుగుతుంది.
ఇప్పటివరకు 840 మంది రోగులకు ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి బయట పడేశారని తెలుస్తోంది. టెనెక్ట్ ప్లేస్ బహిరంగ మార్కెట్ లో 40,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ఉంటుందని సమాచారం అందుతోంది. ప్రభుత్వానికి మాత్రం ఈ ఇంజెక్షన్ 19 వేల రూపాయలకు సరఫరా కానుందని భోగట్టా. సరైన సమయంలో ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం కొసమెరుపు.