తెలుగు సినీ చరిత్రలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్, నిర్మాత కేఎస్ రామారావుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. విభిన్న రకాలు చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ఓ అభిలాష తీయాలన్నా, చంటి సినిమా తీయాలన్నా, క్రిమినల్ లాంటి కొత్త తరహా చిత్రాలను తెరకెక్కించాలన్నా, మాతృదేవో భవ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న అది కేఎస్ రామారావు వంటి వారి వల్లనే సాధ్యమవుతుంది. ఇలా ఆయన నిర్మించిన ఒక్కో చిత్రం ఒక్కో ఆణిముత్యం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వతా.. అంతటి ఘన విజయానికి కారణమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు.డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదిలా ఉండగా ఏపీ ఎన్నికలు, ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం తాలూకూ క్రెడిట్ అక్షరాల పవన్‌కే చెందుతుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు స్టార్ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు.రెండు నెలలు కావొస్తున్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, కూటమి ఏర్పాటు, వైసీపీ ఓటమి ఇంకా జనం మదిలో నుంచి పోలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఏపీ ఎన్నికలపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మరి 11 స్థానాలకే పరిమితం కావడం చాలామందికి మింగుడు పడటం లేదు. ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురై.. సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. తమ అధినేత తిరిగి జనంలోకి వచ్చి, పోరాటాన్ని మొదలుపెట్టాలని ఆ పార్టీ కేడర్ కోరుతోంది. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఎలాంటి యుద్ధం చేశారో అలాగే జగన్ కూడా వ్యూహాలు రచించి, జనంలో ఉండాలని ఆశిస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన వల్లనే కూటమికి ఈ స్థాయిలో అపూర్వ విజయం దక్కిందని అందరూ అంగీకరిస్తున్నారు. జగన్‌ను అథ: పాతాళానికి తొక్కేస్తానని శపథం చేసిన పవర్‌స్టార్ అన్నంత పని చేశారు. పదేళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు.. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకున్నారు. ప్రభుత్వంలోనూ భాగమైన పవన్.. డిప్యూటీ సీఎంగా , ఆరు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టి పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. జనసేన కార్యాలయం, తన క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించి అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో తమ బాధలు చెప్పుకునేందుకు జనం బారులు తీరుతున్నారు.ఏమాత్రం అవకాశం దొరికినా అవతలివైపున్న రాక్షసుడు మేల్కొంటాడోనని ఆయన భయపడ్డారని రామారావు వ్యాఖ్యానించారు. ఏ రాక్షసుడిని ఎలా చంపారో పురాణాల్లో మనం చదువుకున్నామని దానిని పవన్ పూర్తిగా అవగాహన తెచ్చుకుని.. ఎలా చంపాలో, లేవకుండా దెబ్బకొట్టాలో అర్ధం చేసుకుని ప్లాన్ అమలు చేశారని రామారావు ప్రశంసించారు.పవన్‌ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని.. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ స్టూడెంట్‌లా నేర్చుకుంటున్నారని కేఎస్ రామారావు ప్రశంసించారు. మరో మూడు, నాలుగు నెలల్లో ప్రతి అంశం తెలుసుకుంటారని.. చంద్రబాబుకు ఓ పెద్దకొడుకు ఉంటే ఎలా ఉంటాడో అలా తోడుగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కేఎస్ రామారావు వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: