( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ ) .
వైసీపీ అధినేత వైయస్ జగన్ రెడ్డి మాట మాట్లాడితే పదేపదే నా బీసీ .. నా ఎస్సీ ... నా ఎస్టి ... నా మైనార్టీలు అని చెబుతూ ఉంటారు. జగన్కు నిజంగా బీసీలు .. ఎస్సీలు .. ఎస్టీలు .. మైనార్టీలు రాజ్యాధికారం సొంతం చేసుకుని ఎదగటం ఎంత మాత్రం ఇష్టం ఉండదు అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. పేరుకు మాత్రమే బీసీలకు పదవులు ఇస్తారు తప్ప వారికి ఎలాంటి అధికారం ఉండదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాంతాలవారీగా తన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సమన్వయకర్తలను పెట్టి చివరకు మంత్రులు ... ఎమ్మెల్యేలను కూడా డమ్మీలను చేసి ఆడుకున్నారు. వైసీపీలో చివరకు హోంమంత్రికి కూడా విలువలేని పరిస్థితి. జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సమన్వయకర్తలు ఏం చెబితే ? అదే జరిగేది. ఈ క్రమంలోనే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీ నేతలకు ఇప్పుడు ఓడిపోయాక పదవులు కట్టబెడుతున్న పరిస్థితి.
ఇక ఎన్నికల్లో కొందరు బీసీ నేతలకు ఓడిపోయే సీట్లు ఇచ్చి మరీ జగన్ ప్రచారం చేసుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన పైలా నరసింహయ్య వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు పనిచేసిన ఆయనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదు. అసలు ఎవరూ పట్టించుకున్న సందర్భాలు కూడా లేవు .. ఆయనను కేవలం ఉత్సవ విగ్రహంగా మార్చేశారన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. నరసింహయ్య మొత్తం 13 సంవత్సరాల పాటు వైసీపీలో పని చేశారు .. ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో బీసీకి జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం తీరుతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన వీడియో కూడా విడుదల చేశారు.