విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీ - కూటమి పార్టీల మధ్య రాజకీయాన్ని ఆసక్తిగా మార్చేసింది. వాస్తవంగా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలలో వైసీపీకి పూర్తి ఆధిక్యత ఉంది. అయితే వైసీపీకి ఆధిక్యత ఉన్న విశాఖ గ్రేటర్ మున్సిపాలిటీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి విజయం సాధించింది. అలాగే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి పూర్తిగా బలం ఉంది. వైసీపీ కి కచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్నా ... కూటమి పార్టీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నూ ఈ ఎన్నికల్లో గెలవాలని వైసీపీ కి ధీటుగా ప్రణాళికలు రచిస్తున్నాయి.
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలవేళ తమ పార్టీ అభ్యర్థిగా జగన్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దించారు. జగన్ స్వయంగా ఓటర్ లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నిక ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు - పాడేరు నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బొత్స సమక్షంలోని జగన్ సమావేశం అయ్యారు. స్థానిక సంస్థలలో వైసిపికి 600 పైగా స్థానాలలో బలం ఉంది. టిడిపికి కాస్త అటు ఇటుగా 200 పై చిలుకు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇక్కడ గెలుపు చూస్తే వైసీపీ దే అనేలా ఉంది.
రెండు పార్టీల మధ్య 387 ఓట్లు తేడా ఉంది. అయితే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వైసిపి నుంచి జనసేన - టిడిపిలోకి భారీగా వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జంప్ కొట్టేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు భారీ ఎత్తున క్యాంప్ ఏర్పాటు చేసి ఓట్ల కొనుగోలు చేయాలని వైసిపి నిర్ణయం తీసుకుంది. క్యాంపులకు వెళుతున్న వైసిపి ప్రజాప్రతినిధులు ఓటుకు ఎంత ఇస్తారు ? ఎంత తీసుకుందాం ? ఎంత అడుగుదాం అని చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.