* ఆ నామినేటెడ్ పదవులపైనే ఆశవాహుల ఆశలన్నీ..

* చంద్రబాబుకు కత్తి మీద సాములాగా మారిన నామినేటెడ్ పదవుల భర్తీ

* నామినేటెడ్ పదవుల విషయంలో బాబు పొత్తు ధర్మం పాటిస్తారా..?


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడంతో నామినేటెడ్ పదవులపై ఇరు పార్టీలలో కష్టపడిన వారి మధ్య పోటీ మొదలయింది. దీనితో నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో నామినేటెడ్ పదవుల భర్తీ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధం కావడం లేదు..టీటీడీ, ఏపీఎస్సార్టీసీ, ఏపీ ఎండీసీ, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఐడీసీ, పీసీబీ, అప్కాబ్, మార్క్ ఫెడ్, దుర్గ గుడి ఛైర్మన్ వంటి కీలక పదవులకు ఇరు పార్టీలలో డిమాండ్ భారీగా పెరిగింది. టీటీడీ బోర్డు మెంబర్ల పదవుల కోసం చాలా మంది నేతలు కాచుకొని కూర్చున్నారు.ప్రభుత్వం ఏర్పడ్డాక కొంత మంది సీనియర్ నాయకులకు మంత్రి పదవులు రాకపోవడంతో నామినేటెడ్ పదవుల పైనే వారు ఆశలు పెట్టుకున్నారు.. కేబినెట్ స్థాయి పదవులకు విపరీతమైన పోటీ ఏర్పడింది.. ప్రస్తుతం ఈ నామినేటెడ్ పదవులను సామాజిక సమీకరణాలతో  కూర్పు చేయనున్నారు. ఇందులో భాగంగా పార్టీలో సీనియార్టీ ఎంతో సిన్సియార్టీ కలిగిన నాయకులకు అలాగే లాయల్టీ కలిగిన యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

ఎన్నికల ప్రచారంలో అలాగే లోకేష్ యువగళం పాదయాత్రలో కష్టపడిన వారికి ప్రయార్టీ ఉండే ఛాన్స్ ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చ జరిగింది. నామినేటెడ్ పదవుల భర్తీలో మిత్రపక్షాలకూ కూడా సముచిత స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వారి సమాచారాన్ని టీడీపీ ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి తీసుకోవడం జరిగింది..దీనితో మరో పది రోజుల్లో నామినేటెడ్ పదవులు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఈ పదవులపై పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ నాయకులు కూడా ఎన్నో ఆశలు పెట్టికున్నారు..

పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నేతలు ఒత్తిడి పెంచడంతో పవన్ నామినేటెడ్ పదవులపై కచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీ కూడా అంటే పట్టుతో వుంది.
ఇరు పార్టీల డిమాండ్ లను దృష్టిలో పెట్టుకొని నామినేటెడ్‌ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు చేస్తున్నారు.దాదాపు ఈ కసరత్తు తుదిదశకు చేరుకుంది. మరో వారం, పది రోజుల్లో తొలివిడత భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: