మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటిది.. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఇది కూడా ఒకటి.. ఈ నెల నుండి ప్రారంభమవుతుందని చెప్పుకున్నారు.. అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటిది తెలియజేశారు. అన్నా క్యాంటీన్లను ఈ నెలలో ప్రారంభించబోతున్నారు ఆగస్టు 15 నుంచి ప్రారంభించబో.. ముందు 183 ప్రారంభించాలనుకున్నారు.. కానీ కొన్ని సిద్ధం వాటిని మార్చి ఒక 100 వరకు ఈ నెలలో ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత దశలవారీగా వాటిని ప్రారంభించాలనుకుంటున్నారట.


ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ అన్నది ఈనెల 15 నుంచి మొదలు పెట్టాలనుకున్న మరో రెండు నెలలు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాబోయే రెండు నెలల్లో ప్రారంభిస్తామంటూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాజాగా చేసినటువంటి వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.. గడిచిన రెండు రోజుల క్రితం త్వరలోనే అయిపోతుంది అంటూ తెలియజేసిన రవాణా శాఖ మంత్రి నిన్నటి రోజున ఈ విషయాన్ని తెలియజేశారు.దీంతో మహిళలు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది.


మహిళలకు ఉచిత ప్రయాణ విషయాన్ని మరో రెండు నెలల ప్రకటిస్తామని చెప్పినప్పటికీ.. కాస్త సమయం తీసుకునేలా ఉన్నట్టుగా కూటమి ప్రభుత్వం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అమ్మబడి విషయాన్ని, మహిళలకు ప్రతినెల 1500 రూపాయలను ఇస్తామంటే చెప్పిన ఇప్పటివరకు వీటి విషయం పైన ఎక్కడ కూటమి ప్రభుత్వం స్పందించలేదు. వీటన్నిటి పైన కూడా సైలెంట్ గా ఉండడంతో వైసీపీ నేతలు కూడా ఈ విషయంపైన ఈ హామీలను నెరవేర్చాలి అంటూ తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా సీఎం చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటన్నిటిని చేస్తారో లేదో చూడాలి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నష్టాలలో ఉందని ఎన్నోసార్లు తెలియజేశారు. మరి ఇలాంటి సమయంలో ఈ హామీలను నెరవేర్చేర లేదు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: