* పవన్‌ కోసం సీటు త్యాగం చేసిన వర్మ
* ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మకు ఆశ
* పిఠాపురంలో వర్మ వర్సెస్‌ జనసేన వార్‌
* ప్రతి చోటా వర్మకు అవమానాలే


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఇటీవల అధికారంలోకి వచ్చి..  అభివృద్ధిలో దూసుకు వెళ్తోంది. ఎన్నికల కంటే ముందు ప్రకటించిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది తెలుగుదేశం కూటమి సర్కార్. అయితే తెలుగుదేశం కూటమి సర్కార్లో... అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే బిజెపి పెద్దలు..  అన్యోన్యంగా, సఖ్యతగా ముందుకు వెళ్తున్నారు. కానీ కింది స్థాయి లీడర్ల  విషయానికి వచ్చేసరికి...  అనేక విభేదాలు తెరపైకి వస్తున్నాయి.

 టిడిపి వర్సెస్ జనసేన క్యాడర్ మధ్య కొన్నిచోట్ల గొడవలు జరుగుతుంటే..మరికొన్ని నియోజకవర్గాలలో జనసేన వర్సెస్ బిజెపి అన్నట్లుగా ఫైట్ ఉందట. అలాగే టిడిపి వర్సెస్ బిజెపి కూడా  కొన్నిచోట్ల  వివాదాలకు తెరలేపుతోందట. అయితే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కు  తీవ్ర అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి పిఠాపురం వర్మ లేకపోతే..  పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో గెలవడం అతికష్టమయ్యేది.

కానీ చంద్రబాబు ఒప్పించడంతో... పిఠాపురం వర్మ.. పవన్ కళ్యాణ్ విజయం కోసం చాలా కష్టపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు.. దాంతో పవన్ కళ్యాణ్ విజయం కోసం చాలా కష్టపడ్డారు వర్మ. అయితే పవన్ కళ్యాణ్ విజయం సాధించి అటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... వర్మపై జనసేన క్యాడర్ రెచ్చిపోతోందట. ప్రతి విషయంలో... వర్మ అనుచరులు వర్సెస్ జనసేన క్యాడర్ మధ్య వివాదాలు  తెరపైకి వస్తున్నాయట.

 తమ వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడు కాదని కొంతమంది సోషల్ మీడియాలో కూడా... రచ్చ రచ్చ చేస్తున్నారట. ఇక మరికొంతమంది... మా పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదని... వర్మ అనుచరులను ర్యాగింగ్ చేస్తున్నారట జనసేన కార్యకర్తలు. అలాగే ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఓ గుడి విషయంలో కూడా... టిడిపి వర్సెస్ జనసేన మధ్య రచ్చ నెలకొనడం జరిగింది. ఆ సమయంలో జనసేనకు సపోర్ట్ గా వైసిపి నేతలు నిలబడ్డారు. ఇలా పిఠాపురం నియోజకవర్గంలో... వర్మకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని... కొంతమంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: