•పొత్తు రాజకీయాలే ఇబ్బందిగా మారాయా

•పొత్తు సక్సెస్ కోసమేనా..?

•రాష్ట్ర అభివృద్ధికి వీరి సహకారం ఎంతో..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

కలిసి ఉంటేనే కలదు సుఖం , ఐక్యమత్యమే మహా బలం అని పెద్దలు సామెతలను ఊరికే పెట్టలేదు.. అనుభవంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి సామెతలు పుట్టుకొచ్చాయి..అయితే వీటిని కచ్చితంగా ఫాలో అయితే సక్సెస్ కు ఎదురు ఉండదు. ముఖ్యంగా ఏ రంగంలో అయినా సరే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సక్సెస్ అనేది వరిస్తుంది. విమర్శలకు చోటు ఇవ్వకుండా ఎవరికివారు ఆ రంగంలో సక్సెస్ అవ్వగలుగుతారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాంటి సామెతలకు నిదర్శనంగా నిలవాల్సింది పోయి కూటమిలో కుంపట్లు అన్నట్లుగా కూటమి నేతల తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.


గత ప్రభుత్వం వైసిపి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సింగిల్గా అయినా సరే మంచి విజయాన్ని పొందడమే కాదు ప్రజలలో ఎంతో మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే అభివృద్ధి జరగలేదు అన్న ఒక కారణంతో చాలా మంది కూటమి వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగానే సింగిల్ గా అయితే గెలవడం అసాధ్యం అని భావించిన పార్టీలు ఒకటిగా చేరి కూటమిగా పోటీ చేసి అఖండ విజయం అందుకున్నాయి అయితే గెలుపు వరకు బాగానే ఉన్నా అభివృద్ధి వైపు మాత్రం కాస్త ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పాలి. కూటమిలో భాగంగా టిడిపి, జనసేన,  బిజెపిలు ఒకటిగా చేరి ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి 164 సీట్లను సొంతం చేసుకొని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

అయితే ఇక్కడ ఈ మూడు పార్టీలకు చెందిన నేతలు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి ఒకరంటే ఒక్కరికి పడకుండా పోతుంది. ముఖ్యంగా సీనియర్ నేతలైన బుద్దా వెంకన్న , సుజనా చౌదరి ఇద్దరూ కూడా కూటమికి చెందిన వారైనా వీరిద్దరికీ పడడం లేదు. ఇలా వేర్వేరు పార్టీలకు చెందిన వారు కూటమిగా విజయం సాధించిన ఒకరి గురించి ఒకరు అవహేళన చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.  మరొకవైపు జనసేన నేతలు చేస్తున్న మంచి పనులను టిడిపి నేతలు ఓర్వలేక పోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎవరికివారు సింగిల్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఏమో కానీ కూటమిగా అయితే కలిసి పనిచేయడం లేదు. పొత్తు రాజకీయాలు బాగానే ఉన్నా, ఆ పొత్తె ఇప్పుడు కూటమి నేతలలో అసంతృప్తి కలిగిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి వీళ్లంతా కలిసికట్టుగా పనిచేస్తే ఆంధ్రదేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తుంది మరి ఈ విషయాన్ని కూటమి నేతలు దృష్టిలో పెట్టుకొని పని చేస్తారో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: