* టీడీపీలో కుంపట్లు.. బాబుకి తంటాలు
* సొంత పార్టీలో గొడవలపై సీరియస్ అయిన బాబు


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ సొంతం చేసుకున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలైన పుంగనూరు, తంబళ్లపల్లెలో టీడీపీ నాయకులు ఆధిపత్య పోరు స్టార్ట్ అయ్యింది.వైసీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి గొడవ పడటం ఇప్పుడు టీడీపీకు పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుండి టీడీపీలో ఉన్న నాయకులు ఇంకా ఈమధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది.వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరో వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయమై టీడీపీ హై కమాండ్ ఆరా తీయగా.. రాంప్రసాద్ రెడ్డి పుంగునూరు నియోజక వర్గం పర్యటన సందర్భంగా టీడీపీలో వర్గ పోరు మొదలై అది బహిరంగమైంది.మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి స్వాగతం పలికేందుకు ఆయనపై పూలు చల్లారు. ఈ విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. పుంగనూరు టీడీపీ నాయకుడు రమేష్ అలియాస్ ఆర్ వీ. బాబు, ఇటీవల వైసీపీ నుండి టీడీపీలో చేరిన మాధవ రెడ్డి అనుచరుల మధ్య గొడవలు జరిగాయి.


ఆ తర్వాత టీడీపీ సీనియర్ నాయకుడు బాబు గన్ మెన్ అతని అనుచరులు కలిసి మాధవ రెడ్డి వర్గంలోని భీమగానిపల్లెలో నివాసం ఉంటున్న మణికంఠ అనే యువకుడిని తుపాకీతో బెదిరించి పిలుచుకుని వెళ్లి ఇంట్లో నిర్బందించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాధవ రెడ్డి, అతని అనుచరులు బాబు ఇంటికి వెళ్లి మణికంఠని వెంటనే వదలి పట్టాలని నినాదాలు చేయడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించడం జరిగింది.టీడీపీ లీడర్ ఆర్ వీ. బాబు అతని అనుచరులపై కేసు పెట్టాలని మాధవ రెడ్డి వర్గం పుంగనూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ జయరామయ్య టీడీపీ లోని రెండు వర్గాలకు నచ్చ చెప్పడం జరిగింది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికి పుంగనూరులో చెక్ పెట్టాలని ప్రత్యేక ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంత పార్టీలోనే కార్యకర్తలు రెండు విభాగాలుగా విడిపోవడంతో ఆ నియోజకవర్గం ఇన్ చార్జ్ చల్లా రామచంద్ర రెడ్డికి ఫోన్ చేసి సీరియస్ అయ్యారట.మొత్తం మీద పుంగనూరులో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత పార్టీలోనే సొంత నేతలతో తీరని తలనొప్పి మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: