కూటమి ప్రభుత్వం 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో భాగంగా చాలామంది మహిళ నేతలు కూడా మంచి విజయాలను అందుకున్నారు. అలా అందుకున్న వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష కూడా ఒకరు.. అయితే ఇప్పుడు తాజాగా తన సొంత నియోజకవర్గంలోని గిరిజనుల కోసం తన వంతు సహాయంగా చేసిన పని తెలిసి అక్కడి నియోజకవర్గం ప్రజలతో పాటు ప్రజలు కూడా ఈ ఎమ్మెల్యేను మెచ్చుకుంటున్నారు. గిరిజనులు అత్యవసరంగా వైద్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసిన ఎమ్మెల్యే శిరీష తన సొంత ఖర్చుతో 9 లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ని కొనిచ్చిందట.


ఆదివాసి దినోత్సవం కావడం చేత ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ అంబులెన్స్ ని సైతం మొదలుపెట్టింది శిరీష. ఈ వాహనం పైన కూటమినేతలతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోలతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. గిరిజనులకు అత్యవసర సమయాలలో ఆసుపత్రికి వెళ్లడానికి ఈ అంబులెన్స్ చాలా ఉపయోగపడుతుందని, సరైన సమయంలో చికిత్స అందక చాలామంది గిరిజనులు కూడా మరణించారనే విషయం తెలుసుకొని,  ఈ పని చేసినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే శిరీష..


అంతేకాకుండా గిరిజనులు మరణించిన తర్వాత తమ ఇళ్లకు కూడా వారిని తరలించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందట. తన భర్త విజయభాస్కర్ సహకారంతోనే ఈ వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే శిరీష దేవి.. గిరిజన ప్రాంతాల కోసం అభివృద్ధి చేయడానికి ఇలాంటివి తన వంతు సహాయంగా చేస్తున్నానని తెలుపుతోంది. గిరిజన కష్టాలను కూడా తాను దగ్గర నుంచి చూశానని రంపచోడవరం మన్యం ప్రాంతంలో గిరిజనుల కంటి నుండి చిరునవ్వే తనకు లక్ష్యం అంటూ తెలియజేస్తోంది ఎమ్మెల్యే శిరీష. అయితే ఈ పని చేసిన మహిళా ఎమ్మెల్యేను సైతం చాలామంది నేతలు  మెచ్చుకుంటున్నారు . కానీ కూటమిలో మిగిలిన వారు ఇలాంటి పనులు చేయకుండా కేవలం కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారంటూ వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: