•అనంతపురం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్

•రాజకీయాలకు దూరం కానున్నారా..

•అనంత వెంకటరామి రెడ్డి సంచలన నిర్ణయం..




అనంత వెంకటరామి రెడ్డి రాజకీయ నాయకుడు,  పార్లమెంటు సభ్యులు కూడా.. అనంతపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 11, 12,13వ లోక్సభలకు ఎన్నికైన ఈయన అనంతపురం అభివృద్ధిలో ఎంతో పాటుపడ్డారు. ముఖ్యంగా రోడ్డు నిర్మాణమే కాదు మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చేసి అత్యంత సుందరంగా, మహానగరంగా తీర్చిన ఘనత అనంత వెంకటరామిరెడ్డికే సొంతం. ముఖ్యంగా ఈయన హయాంలో అనంతపురం పెద్దపెద్ద నగరాలతో పోటీపడుతూ అభివృద్ధి చెందుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో దొరకంది లేదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. వస్త్రాలను మొదలుకొని పాదరక్షలు వరకు అన్ని బ్రాండెడ్ వస్తువులే ఇక్కడ సొంతం చేసుకోవచ్చు.
దీనంతటికీ కారణం అనంత వెంకట్రామిరెడ్డి అని చెప్పాలి. ప్రస్తుతం ఈయన వయసు 68 సంవత్సరాలు.

1987 - 1996 మధ్యకాలంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పని చేసిన ఈయన, 1996లో 11వ లోక్ సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు లోక్ సభకు ఎన్నికైన 2004లో జరిగిన లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి మూడవసారి కూడా విజయం అందుకొని హ్యాట్రిక్ అందుకున్నారు. ఇక 2009 ఎన్నికలలో పోటీ చేసి నాలుగవసారి కూడా గెలిచి 15వ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన ఈయన,  2019 ఎన్నికలలో కూడా గెలిచి మరోసారి రికార్డు సృష్టించారు. అయితే మళ్లీ ఈసారి కూడా అధికారంలోకి వస్తామని ఆశించిన అనంత వెంకట రామి రెడ్డి ఊహించని విధంగా ఘోరమైన ఓటమిని చవిచూసారు.

తాజాగా జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు.  దీంతో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే అనంత వెంకట్రామిరెడ్డి రాజకీయ జీవితానికి స్వస్తి పలకనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వయసు పైబడడం పైగా వైసిపి ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయన ఇంకొక పార్టీలోకి షిఫ్ట్ అవుతారా అంటే అది లేదు..గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా ప్రకటించిన ఈయన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైసీపీ పార్టీలోకి చేరి పార్టీకి సహాయం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో మనస్థాపానికి గురి అయిన ఈయన త్వరలోనే రాజకీయాలకు స్వస్తి పలకనున్నట్టు సమాచారం . ఏది ఏమైనా ఒక లెజెండ్రీ రాజకీయవేత్త రాజకీయాలకు దూరం కాబోతున్నారని తెలిసి పార్టీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: