• పాలిటిక్స్ కి గుడ్ బై చెబుతున్న సీనియర్ పొలిటిషన్లు
• ఏపీలో వైసిపి ఓడిపోయిన తర్వాత ఎక్కువవుతున్న రాజీనామాలు
• వీరభద్రస్వామి కూడా గుడ్ బై చెప్పే అవకాశం
వైసీపీ ఓడిపోయిన తర్వాత అందులో నుంచి సీనియర్ నాయకులు చాలామంది రాజకీయాలకు బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిలో వైసీపీ సీనియర్ పొలిటీషియన్ ఒకరు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వైసీపీ హయాంలో స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఈయన దిగిపోతారు. ఆయన స్థానంలో వేరే వారిని ప్రకటించాల్సి ఉంది. ఈసారి విజయనగరం నుంచి పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పుష్పపతి మీద 60,632 తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత ఆయన పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆయనకు ఇప్పటికే 64 ఏళ్లు వచ్చాయి. నాలుగు దశాబ్దాలకు పైగానే ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. ఈ సీనియర్ మోస్ట్ లీడర్ 1983లోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటినుంచి రాజకీయాల్లో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఇంకోసారి పోటీ చేసే సమయానికి ఆయనకు 70 ఏళ్ల వయసుకు వస్తుంది. ఇప్పటిదాకా విశేషమైన సేవలు అందించిన ఇకపై పోటీ చేయకపోవచ్చు పైగా వైసీపీ పతనమవుతోంది.
కోలగట్ల వీరభద్రస్వామి మొదటగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డెరైక్టర్‌గా నియమితులయ్యారు. 87లో విజయనగరం మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. తర్వాతే ఈ సంవత్సరంలో అర్బన్ బ్యాంకు అధ్యక్షునిగా విశేష సేవలు అందించారు.
1989లో విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేయగా నిరాశ ఎదురయ్యింది అతను ఓటమిని చవి చూశారు. 1994,1999 ఎన్నికల్లోనూ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతనే అతన్ని విజయం వరించింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈయన పూసపాటి అశోక్ గజపతి రాజుపై తన విజయం సాధించారు. అలా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మళ్లీ ఓడారు. 2013లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఏపీ శాసనమండలికి ఎమ్మెల్సీగా సెలెక్ట్ అయ్యారు. ఆపై విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వర్క్ చేశారు.
వీరభద్రస్వామి 2014లో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి విజయనగరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నారు. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మాత్రం సెలెక్ట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచారు కానీ ఈసారి మాత్రం ఓడిపోయారు ఆ ఓటమి పొలిటికల్ కెరీర్‌కు శుభం కార్డు వేసిందని చెప్పుకోవచ్చు.