ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు నారా లోకేష్ చక్రం తిప్పుతున్నారు. ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం... అది కూడా భారీ మెజారిటీతో నారా లోకేష్ విజయం సాధించడంతో.. ఆయన దూకుడుకు కళ్లెం వేయలేకపోతున్నారు. అదే సమయంలో.. మరోసారి మంత్రి కావడం... నారా లోకేష్ కు అచ్చి వచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... మంగళగిరి నియోజకవర్గంలో శత్రుశేషం లేకుండా చేసుకుంటున్నారు నారా లోకేష్.

 

తన ప్రత్యర్థి  కుటుంబాన్ని కూడా పార్టీలోకి లాగేసుకుంటున్నారు. వాస్తవంగా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన  నారా లోకేష్ ఈసారి అఖండ మెజారిటీతో విజయం సాధించారు.  దాదాపు 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ విజయం సాధించి మంత్రి అయ్యారు. అయితే.. మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేసిన  అభ్యర్థి మహిళ. వైసిపి అభ్యర్థిగా మూడు లావణ్య బరిలో ఉన్నారు.

 అయితే ఆమెకు ఇది తొలి ఎన్నిక. కానీ టిడిపి కూటమి దాటితే ఆమె ఓడిపోవడం జరిగింది. సామాన్య మామయ్య.. మురుగుడు హనుమంతరావు...  ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తల్లి కమల కుమారి కూడా ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అయినా కూడా మంగళగిరిలో లావణ్య జెండా ఎగరలేదు. నారా లోకేష్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది  మురుగుడు లావణ్య.

అయితే... ఇప్పుడు మురుగుడు లావణ్య కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మురుగుడు లావణ్య మామయ్య... మురుగుడు హనుమంతరావు సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆయన పార్టీ మారెందుకు సిద్ధమయ్యారట. త్వరలోనే నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరేందుకు హనుమంతరావు... రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చేనేత బ్యాగ్రౌండ్ కు చెందిన హనుమంతరావు.. టిడిపిలో చేరితే తమకు  బలం చేకూరుతుందని నారా లోకేష్ అనుకుంటున్నారట.

 అంతేకాదు ఇటీవల...  నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికుల కోసం ప్రకటించిన వరాల నేపథ్యంలో...  నారా లోకేష్ ను పరోక్షంగా మెచ్చుకున్నారు మురుగుడు హనుమంతరావు. అయితే.. మొన్నటి వరకు ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఉన్న.. నారా లోకేష్ ను... హనుమంతరావు పొగడడం వెనుక... కొత్త చర్చ జరుగుతోంది. హనుమంతరావు త్వరలోనే... పార్టీ మారబోతున్నారని అంటున్నారు. మరి దీనిపై లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: