తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నాయకుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న బిజెపి పార్టీ...  ముందున్న జోష్ లో ఇప్పుడు కనిపించడం లేదు. పార్టీలో కొత్తవారు అలాగే, పాతవారు ఉన్నట్లుగా తెలంగాణ బిజెపి విడిపోయింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్,రాజా సింగ్ లాంటి పాత నేతలు అందరూ ఒకటై... కొత్త నేతలను తొక్కేస్తున్నారట.


ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షున్ని మార్చాలని మొదటి నుంచి బిజెపి అధిష్టానం భావిస్తోంది. దీంతో కిషన్ రెడ్డి పదవికి ఇప్పుడు ఎసరు రాబోతుంది.  ఇలాంటి నేపథ్యంలోనే వెంకయ్య నాయుడును ప్రసన్నం చేసుకునే పనిలో కిషన్ రెడ్డి ఉన్నారట.  మళ్లీ పదవి తనికే వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట కిషన్ రెడ్డి. అలాగే కిషన్ రెడ్డికి రాకపోతే... రాజాసింగ్ లేదా బండి సంజయ్ లో  ఎవరో ఒకరికి ఆ పదవి రావాలని పాత  బిజెపి నేతలు స్కెచ్ వేశారట.


అయితే... తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి రావాలంటే..  చంద్రబాబు ను ప్రసన్నం చేసుకోవాలని పాత నేతల్లో ఓ ఆలోచన వచ్చిందట. దీంతో మొన్న తిరుపతికి వెళ్లిన బండి సంజయ్... చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.  ఇటు రాజాసింగ్ కూడా... దేవాలయాల విషయం పైన చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబును పొగుడుతూ రాజాసింగ్.. కామెంట్స్ ఉన్నాయి.

 

అయితే తెలంగాణ బిజెపి నేతల మాటలు.. కేంద్ర బిజెపి అధిష్టానం వినేలా కనిపించడం లేదట. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్న నేపథ్యంలో... ఆయన ద్వారా బిజెపి  అధ్యక్ష పదవిని తెచ్చుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారట. అందు కే చంద్రబాబును జోకే ప్రయత్నం చేస్తున్నారట. అదే సమయంలో ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి నేతలకు పదవులు రాకుండా కూడా... కిషన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: