* నాని
ని వెంటాడుతున్న కర్మ ఫలం.!
* స్వయం అపరాధమే నానీ పరిస్థికి కారణమా.?
* రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న ఊర
మాస్ నాయకుడు.!
* ఆరోగ్య సమస్యలా..? వెంటాడుతున్న భయమా..?
(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని ఆ మధ్య ఓసారి కనిపించి మళ్ళీ అడ్రెస్ లేకుండా పోయాడు.మాజీ సీఎం జగన్ తో ఆయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఓటమి తర్వాత కూడా జగన్ కు కొడాలి నాని కుడిభుజంగా ఉంటారనుకున్నారు. కానీ, ఎందుకో ఆయన పెద్దగా జగన్ తో కనిపించడం లేదు.అయితే డానికి గుడివాడ స్థానిక ప్రజలు నుండి వచ్చిన సమాచారం ప్రకారం నాని కూడా కేశినేని నాని బాటలోనే నడుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం తీవ్రం కావడంతో ఎందుకు కొడాలి నాని ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే, ఆయన అనారోగ్య సమస్యతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటుండగా ఊహించని విధంగా వైసీపీ ఓడిపోవడంతోనే క్రమంగా రాజకీయాలకు దూరం కావాలన్న ఆలోచనతో ఉన్నారని మరికొంతమంది అంటున్నారు.అసలే కష్టకాలంలో ఉన్న వైసీపీపై ఇది తీవ్ర ప్రభావం చూపనుండటంతో ఇప్పటికప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పకుండా, క్రమంగా పార్టీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తు ఉండొచ్చు. అలా ఎన్నికల నాటికి తన ఫ్యామిలీ నుంచి ఒకరిని రాజకీయ వారసుడిగా ప్రకటించే అవకాశం ఉంది.తెలుగుదేశం పార్టీ నేతలు పెడుతున్న వరుస కేసులు, ఇబ్బందులు తట్టుకోలేక కొడాలి నాని రాజకీయాలకు దూరం కాబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే కొడాలి నాని ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగుండటం లేదట.దాంట్లో భాగంగానే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే రాజకీయ సన్యాసం ఇప్పుడే చేయడని మరో ఏడాది లేదా రెండు సంవత్సరాల లోపు కొడాలి నాని గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న వైసిపి పార్టీని ఇప్పుడే వదిలితే మరికొంతమంది లీడర్లు కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పే ప్రమాదం ఉంటుంది. అందుకే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ నిర్ణయం తీసుకొని ఉన్నారట కొడాలి నాని.అయితే కొడాలి నాని ఆరోగ్యం బాగాలేదు అనే దాన్ని అడ్డు పెట్టుకొని చిన్నగా వైసీపీ నుండి బయటకి వచ్చి కొంతకాలం రాజకీయా సన్యాసం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే తన రాజకీయా వారసుడిగా నాని అన్న కొడుకును సిద్ధం చేస్తున్నట్లు పుకార్లు వినబడుతున్నాయి. అయితే అసలు నాని వ్యూహం ఎందనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.పైగా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన అధినేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెల్సిందే అసలు ఇంకో విధంగా చెప్పాలంటే ఇలాంటి నాయకుల వల్లే వైసీపీ అంటే ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేవిధంగా ప్రవర్తించిన వారిలో కొడాలి నాని ఒకరు.