ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ఎన్నికలకు అటు వైసీపీ కూటమి పార్టీలు సైతం సిద్ధమవుతున్నాయి.. ముఖ్యంగా వైసిపి అభ్యర్థిగా బొత్స  సత్యనారాయణ ఎంపిక చేయడం జరిగింది. అయితే కూటమి అభ్యర్థి ఎవరో అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజున అభ్యర్థి ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారని విషయం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అంతేకాకుండా అందరు అభిప్రాయాలను కూడా ఏపీ సీఎం చంద్రబాబు సేకరించే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది.



అలాగే ఎంత మంది ఓటర్లు ఉన్నారు అర్బన్ లో ఎన్ని ఓట్లు రూరల్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే అంశం పైన పలు రకాల సమీక్షలు కూడా చేస్తున్నారట. మరొక వైపు ఎంపీటీసీలను, సర్పంచ్లను సైతం వైసీపీ పార్టీ ఇప్పటికే క్యాంపులకు తరలించాలనే విషయాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. పార్టీల స్థానిక బలాబలాల పైన నేతలతో పాటు అధినేత కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.


బొత్స  సత్యనారాయణ ను ఢీకొట్టే అభ్యర్థిని ఎవరిని రంగంలోకి దించేలా  ఏపీ సీఎం చాలా కసరత్తు చేస్తున్నారట. ఇదంతా ఇలా ఉంటే ఇటీవలే జరిగిన విశాఖపట్నం GVMC  ఎన్నికలలో భాగంగా పదికి మందికి పైగా సభ్యులు కూటమి అభ్యర్థులే గెలిచారట .దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కూడా తామే గెలిచి తీరుతామంటూ అటో కూటమి నేతలు టిడిపి జనసేన బిజెపి పార్టీలు చాలా బలంగా తెలియజేస్తున్నారు. అయితే వైసిపి పార్టీ కూడా ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి పూర్తిగా తెలియాలి అంటే ఈ నెల 30 వ తేదీ వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: