కొంత మంది రాజకీయ నాయకులు కురవృద్ధులు అయ్యే వరకు రాజకీయాలపై దృష్టి పెడుతూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం కొంత వయసు వచ్చే సరికి రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచనకు వస్తూ ఉంటారు. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంతో మంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిన నేతలలో మల్లాది విష్ణు ఒకరు. ఈయన తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించాడు. విష్ణు మొదటిసారి విజయవాడ సెంట్రల్ నుండి 2009 సంవత్సరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ విజయవాడ సెంట్రల్ నుండి 2014 కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మల్లాది విష్ణు , వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో విజయవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ (వుడా) కి ఛైర్మన్‌ గా పని చేశాడు. విష్ణు ఆ తర్వాత వై యస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్సిపి పార్టీ లో చేరాడు. 2019 లో మల్లాది విష్ణు వైసీపీ పార్టీ నుండి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచాడు.

ఇక ఈ సారి కూడా ఈయన గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. ఇకపోతే మల్లాది విష్ణు 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సీటు వైసీపీ పార్టీ నుండి తనకే వస్తుంది అని భావించాడు. కాకపోతే ఆ ప్రాంత అసెంబ్లీ స్థానాన్ని వై సీ పీ పార్టీ వేల్లంపల్లి శ్రీనివాసరావు కి ఇచ్చింది. ఇక ఈ ప్రాంతం నుండి టి డి పి పార్టీ అభ్యర్థిగా 2024 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో బోండా ఉమామహేశ్వరరావు బరిలో నిలిచాడు.

ఈ ఎన్నికలలో టిడిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గెలుపొందాడు. ఇకపోతే వైసీపీ పార్టీలోకి రావడం , ఆ పార్టీ ఓడిపోవడం వాళ్ల మల్లాది విష్ణు రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పే అవకాశాలు ఉన్నట్లు కొంతమంది భావిస్తున్నారు. మరి మల్లాది విష్ణు రాజకీయాలకు గుడ్ బై చెబుతాడా లేక కొనసాగుతాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: