అయితే అందుకు సంబంధించిన కాంగ్రెస్ మంత్రిని కూడా కలసినట్టుగా సమాచారం. కొన్ని ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటన ఒక్కసారిగా రాజకీయాలలో మరింత వేడి పుట్టించేలా చేస్తోంది. చంద్రబాబు ఒక సీరియస్ మేటర్ కోసమే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ని పంపించారనే విధంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్ గా ఉన్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వైసీపీతో బాగా టచ్ లో ఉన్నారని.. ఇండియా కూటమిలో చేరేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని గత కొంతకాలంగా వార్తలయితే వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా వైసీపీ ఢిల్లీలో చేసిన ధర్నాలో కూడా ఇండియా కూటమి పెద్దలు చాలామంది పాల్గొనడం జరిగింది.. దీంతో ఒక్కసారిగా కూటమి నేతలు ఆశ్చర్యపోవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇండియా కూటమికి వైసిపి దగ్గర కాకూడదని.. అంతేకాకుండా వైసీపీ పార్టీకి ఏ జాతీయ పార్టీ కూడా అండలేకుండా చేయాలని ఉద్దేశంతోనే కూటమి ప్లాన్ చేసి చంద్రబాబును పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. లేకపోతే పవన్ కళ్యాణ్ తానంతట తానే స్వయంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలా వెళ్లార అనే విషయం తెలియాల్సి ఉన్నది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో జనసేన పార్టీ మధ్య అంతర్గతం ఏంటి అన్న విషయం తెలియాల్సి ఉన్నది. గత 2024 ఎన్నికలలో వైఎస్ షర్మిల కూడా పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది..పవన్ కళ్యాణ్ కలయిక కూటమికి చేటు చేస్తుందా లేకపోతే మేలు చేస్తుందా చూడాలి మరి.