గతంలో టిడిపిలో ఉన్నప్పుడు పాత పరిచయాలతో ఏపీ సీఎం చంద్రబాబుకి రాయబారాలు పంపిస్తున్నారట మాజీమంత్రి. వారందరూ కూడా ఇతర జిల్లాలలో నేతలు కావడం చేత పెద్దగా వర్కౌట్ కాలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్కే గడప దిగే గడప అంటూ నాన్న తంతాలు పడుతున్నారు సిద్ధ. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి కీలక నేత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మంతనాలు జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఎంట్రీ ఇచ్చిన సిద్ధరాఘ రాఘవరావు.. 2004 ఒంగోలు అసెంబ్లీ నుంచి మొదటిసారిగా పోటీ చేసి ఓడారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో దర్శి నుంచి టిడిపి మంత్రిగా గెలిచి అదే ఊపులో మంత్రి పదవి కూడా సంపాదించారు.. 2019లో అప్పటి పరిస్థితులలో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మరి ఓడిపోయారు. వైసిపి పార్టీ అధికారంలోకి రావడంతో తన వ్యాపారాల దృష్టి ఆలోచించకుండా కండువా మార్చి వైసిపి పార్టీలోకి చేరారు మాజీమంత్రి. 2024 ఎన్నికలలో వైసీపీ నుంచి దర్శి టికెట్ ఆశించిన దక్కలేదు. వైసిపి పార్టీ అధికారంలోకి రాగానే గ్రానైట్ టార్గెట్ గా దాడులు జరగడంతో ఉక్కిరిబిక్కిరి అయిన మాజీమంత్రి పార్టీ మారినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కూడా మళ్లీ అదే రిపీట్ అవుతుందనుకున్నారేమో కానీ టిడిపి పార్టీ పవర్ లోకి రాగానే వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ టిడిపి క్యాడర్ మాత్రం ఈయనని దూరంగానే ఉంచాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.