ఉద్యోగ రిజర్వేషన్ల కోసం నిరసనలుగా మొదలై దేశ ప్రధానినే పారిపోయేలా చేసిన పరిస్థితి బంగ్లాదేశ్ లో నెలకొంది. దేశం ఆర్మీ చేతుల్లోకి వెళ్లినా పరిస్థితులు మాత్రం అదుపులోకి రాలేదు. ఈ సందర్భంలో బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు పెరిగాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అయ్యే ప్రమాదం ఉందని అర్థం అవుతుంది.


ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే.. భారత్ పక్కలో ముప్పు ఉందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ దేశంలో పెరుగుతున్న నిరోద్యాగానికి, ఆర్థిక సంక్షోభానికి మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణం అనే భావన అక్కడి నిరుద్యోగుల్లో, యువతలో పెరిగింది. విద్యార్థులతో మొదలైన నిరసనలు.. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. యువత, విద్యార్థులు కలిసి అల్లకల్లోలం సృష్టించాయి. దేశాన్ని నియంత్రించలేని పరిస్థితికి హసీనా వచ్చేశారు. మిలటరీ సైతం ఆమెను రాజీనామా చేయాలని సూచించింది. ఇక ఆమె చేసేదేమీ లేక పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. తల దాచుకోవడానికి హుటాహుటీన భారత్ వచ్చేశారు.


ఆ తర్వాత ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలనే సమాలోచనలు జరిగాయ.  విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, ఆర్మీ అధికారులు కూర్చొని మాట్లాడుకున్నారు. వీరంతా నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనుస్ వైపు మొగ్గు చూపారు. తాత్కాలిక పరిపాలన యంత్రాగానికి సారథిగా యూనుస్ నియమిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలన పగ్గాలు మారడం ద్వారా మరోసారి స్వాతంత్ర్యం వచ్చినట్లు అయిందని.. దీనిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అయితే బంగ్లాదేశ్ కూడా పాక్ మాదిరి అయిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలా అంటే.. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం ఉంటుంది కానీ ప్రజల నిర్ణయాలకు గౌరవం ఉండదు. అక్కడ సైన్యం పెత్తనమే నడుస్తోంది. దీనికి ఉదాహరణే  ఇమ్రాన్ ఖాన్. ఆయన ప్రజాభిమానాన్ని చూరగొన్నా.. సైన్యం మాట వినలేదు. దీంతో ఆయనపై కేసులు పెట్టి జైలులో పెట్టారు. తమ మాట వినే వ్యక్తిని ప్రధాని చేశారు. ఇప్పుడు కూడా యూనుస్ సైన్యం మాట వినేంత వరకు పదవిలో ఉంటారు. లేకపోతే ఆయన కూడా పలాయనం సాగించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: