* డబ్బులేని దువ్వాడను పెళ్లి చేసుకున్న వాణి
* పెళ్లైన 2 ఏళ్ల నుంచే వాణికి నరకం
* ఇద్దరు పిల్లలున్నా..దారితప్పిన దువ్వాడ
* మాధురితో దువ్వాడ సంబంధం


ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్... హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి... దువ్వాడ శ్రీనివాస్  అక్రమ సంబంధం గురించి సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో.. వార్తలు వస్తున్నాయి. తన భర్త దువ్వాడ శ్రీనివాస్.. తన కుటుంబాన్ని వదిలి వేశాడని... మాధురి అనే మహిళతో... దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నాడని... ఆయన భార్య దువ్వాడ వాణి ఆరోపణలు చేస్తున్నారు.


అంతే కాదు దువ్వాడ శ్రీనివాస్ కట్టుకున్న కొత్త ఇంటి ముందు... ఒక రోజంతా ధర్నా కూడా చేశారు దువ్వాడ శ్రీనివాసు భార్య వాణి, ఆయన కూతుర్లు. ఈ తరుణంలోనే దువ్వాడ వానిపై దాడి చేయబోయారు దువ్వాడ శ్రీనివాస్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఈ వివాదం మరింత రాజుకుంది. అయితే.. తన భర్తను... ట్రాప్ చేసి మరి... వలలో వేసుకుందని మాధురిపై సంచలన ఆరోపణలు చేస్తోంది దువ్వాడ వాణి.


దువ్వాడ శ్రీనివాస్ దగ్గర... ఒక్క రూపాయి లేకున్నా కూడా తన కుటుంబాన్ని ఎదిరించి మరీ అతని పెళ్లి చేసుకున్నానని దువ్వాడ వాని చెబుతోంది. కానీ పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత... దువ్వాడ శ్రీనివాస్ ఆగడాలు మరింత ఎక్కువ అయ్యాయని ఆరోపణలు చేసింది. ఇద్దరు కూతుర్లు ఉన్నా కూడా....సిగ్గు లేకుండా... మాధురి వలలో పడిపోయాడని దువ్వాడ శ్రీనివాస్ పై ఫైర్ అయింది.


తన భర్త గెలవాలని తాను ఎంతో కృషి చేశానని... కానీ తనకు తన కుటుంబానికి... దువ్వాడ శ్రీనివాస్ అన్యాయం చేస్తున్నాడని మండిపడింది. ఇప్పటికైనా దువ్వాడ శ్రీనివాస్ తనకు కావాలని... దువ్వాడ వాణి అంటుంది.  తన చిన్న కూతురు పెళ్లి వయసుకు వచ్చిందని.. ఇలాంటి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఇలా వ్యవహరించడం మంచిది కాదని కోరింది. ఇప్పటికైనా... దువ్వాడ శ్రీనివాస్ మారి తమతో ఉండాలని ఆమె డిమాండ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: