వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలామందిని రాజకీయంగా .. ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కొంతమంది నేతలు అసలు అడ్రస్ లేకుండా పోయారు. వారు ఎక్కడికి వెళ్లారో ? అసలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ? తెలియని పరిస్థితి అలాంటి వారిలో బాపట్ల జిల్లాలోని పరుచూరు - అద్దంకి నుంచి పోటీ చేసిన వైసిపి నేతలు పాణెం చిన్న హనిమిరెడ్డి - ఎడం బాలాజీ ఉన్నారు. ఎన్నికలకు ముందు జగన్ పరుచూరు - అద్దంకిలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకక ఎక్కడెక్కడ నుంచో దిగుమతి చేశారు. అద్దంకికి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం దొడ్లేరు కు చెందిన చిన్న హనిమిరెడ్డికి సీటు ఇచ్చారు. అసలు హనిమిరెడ్డి అక్కడ పోటీ చేయడానికి ఇష్టపడలేదు.
అయితే వై వి సుబ్బారెడ్డి తో ఆయనకి ఉన్న లావాదేవీలు నేపథ్యంలో హనిహి రెడ్డి అక్కడ బలవంతంగా పోటీ చేసి కోట్ల రూపాయలు నష్టపోయారు. ప్రస్తుతం మంత్రి గా ఉన్న గొట్టిపాటి రవి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆయన అక్కడ అడ్రస్ లేకుండా పోయారు. అలాగే పరుచూరు లో పోటీ చేసేందుకు ఎవరు దొరకకపోవడంతో అప్పుడెప్పుడో 2014లో చీరాలలో వైసీపీ నుంచి పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఎన్నారై ఎడం బాలాజీకి సీటు ఇచ్చారు. ఎడం బాలాజీ పై ఏలూరి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అద్దంకిలో హనిమి రెడ్డి పరుచూరులో బాలాజీ అడ్రస్ లేకుండా పోయారు .. పార్టీని పూర్తిగా గాలికి వదిలేసారు. జగన్ తమకు అనవసరంగా టిక్కెట్లు ఇచ్చి తాము ఆర్థికంగా నష్టపోయి మునిగిపోయేలా చేశారని ఈ ఇద్దరి నేతలు ఇప్పుడు లోబోదిబో మంటున్నట్టు సమాచారం.