విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో టీడీపీ అల్లరి మూకలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంబేద్కర్ విగ్రహం కింద ఒక పెద్ద శిలాఫలకం ఉంటుంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి పేరు కూడా రాసి ఉంది. అయితే జగన్ పేరును టీడీపీ గుండాలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆ శిలాఫలకాన్ని పీక్కుని పరారయ్యారు. అది చాలా పెద్ద స్టీల్ శిలాఫలకం. ఈ విగ్రహం ప్రతిష్టాపించిన చోటా చుట్టూ పోలీస్ కమిషనర్, గవర్నర్ లాంటి ప్రముఖులు ఉంటారు. అలాంటి ప్రదేశంలో కరెంటు ఆఫ్ చేసి దాన్ని దొంగలించారు. దీన్ని అరాచక, దుర్మార్గపు చర్యగా పరిగణించవచ్చు.

అయితే వైసీపీ మాత్రం టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ఇలాంటి దాడులను అరాచకంగా ప్రొజెక్ట్ చేయలేకపోతోంది. దుర్మార్గపు పనులకు పాల్పడుతున్న టీడీపీ చర్యలను హైలైట్ చేయడానికి బదులుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తోంది. అంబేద్కర్ లాంటి మహానేత విగ్రహం కింద ఉన్న శిలాఫలకాన్ని తొలగించడం చాలా తప్పు. అసలు ఆ విగ్రహం ప్రాంగణంలో ఉన్న వాటిని ధ్వంసం చేయడమే ఖండించాల్సిన విషయం. కానీ వైసీపీ దీని గురించి మాట్లాడకుండా ఏదేదో పనులు చేస్తుంది. విగ్రహానికి ఏదో డ్యామేజ్ చేసినట్లు, తాము మాత్రం ప్రేమ చూపిస్తున్నట్లుగా ప్రజలకు తెలియజేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారు. అయితే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు.

టీడీపీ వాళ్లు చేసిన ఒక అరాచకాన్ని అరాచకంగా ప్రజలకు చూపించే మంచి ఛాన్స్‌ వీళ్లు కోల్పోయారు. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని టచ్ చేయడం దళితులను అవమానించినట్లు. అందుకే వాళ్ళు ఈ దాడి పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అత్యంత అనైతిక, దుర్మార్గపు, హింసాత్మక చర్యగా దీన్ని చూడాలి. ఇక్కడ చుట్టూ పోలీసులు ఉంటారు. వారు ఉండగానే స్మృతివనం దగ్గరికి టీడీపీ అల్లరి మూకలు చేరాయి. తర్వాత వారిని తరిమేసి సిబ్బంది ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. ఆపై శిలాఫలకం మీద ఉన్న జగన్ పేరు ధ్వంసం చేశారు. పోలీసులు చూస్తూ ఉండిపోయారంటే దీనికి వాళ్ళు సపోర్ట్ పలికినట్లు లెక్క.

ఇలా అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన వారి పేర్లను తొలగించుకుంటూ పోతే ఒక పెద్ద రావణ కాష్టం రగులుతుంది. ఈ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని ఆలోచించింది, ఆ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఒక్క జగన్ మాత్రమే కాబట్టి శిలాఫలకం మీద ఆయన పేరు ఉండటం ఏ విధంగా చూసుకున్నా న్యాయమే!

మరింత సమాచారం తెలుసుకోండి: