మిగతా సమయంలో ఎక్కడా కూడా పేకాట అనేది ఎక్కడ జరగలేదు. ఇది వైసీపీ ప్రభుత్వం అడ్డుకట్టు వేసినటువంటిది. పేకాటని క్లబ్ ను ఏర్పాటు చేయలేదు.. ఇక్కడున్నట్టు వారంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరి పేకాట ఆడుకున్నటువంటి సందర్భాలు ఏర్పాటయ్యాయి. శ్రీలంక, గోవా వంటి ప్రాంతాలలో ఆడేవారు. అలాగే చికోటి వంటి వారు బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతట కూడా పేకాట నడుస్తోంది అంటు ప్రముఖ న్యూస్ పేపర్ ప్రచురించడం జరిగింది. బ్రోకర్..జోకర్.. సర్కారే అంటూ వేసుకొచ్చింది.
టోటల్గా జాక్, క్విన్, ఆస్ అంటూ ఊరురా అధికారికంగా పేకాట క్లబ్బులు.. ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న తమ్ముళ్లు అంటూ రాసుకుంది. నగరాలు పట్టణాలు యదేచ్చగా సాగుతున్నాయి అంటూ తెలియజేస్తోంది. అధికారికంగా అనధికారికంగా క్లబ్బులు దాదాపుగా వంద ఉన్నాయి. వారానికి టర్నోవర్ 397 కోట్లు అన్నట్లుగా తెలియజేస్తున్నారు. టిడిపి నేతల కమిషన్ 397 కోట్లు వస్తోంది అంటు తెలుపుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది పోలీసులకు తెలియాలి.. ఆయా పేకాట ఆడే వాళ్లకు కానీ.. వాళ్ల కుటుంబాలకు గాని తెలియాల్సి ఉంటుంది.. ఇటీవలే రాయలసీమలోని ఒక ఎమ్మెల్యే కూడా పేకాట ఆడడం పైన మాట్లాడడంతో ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది.