-పదేళ్లు ప్రజా సమస్యలు పక్క దారి..
- గులాబీ పార్టీ ఏం చేసినా హైలెటే..
- తెలుగు మీడియా తీరు మారేదెన్నడో అంటున్న ప్రజలు..


 మీడియా ప్రజలకు,రాజకీయ నాయకులకు మధ్య వారధిగా ఉంటుంది. ఒకప్పుడు మీడియా వచ్చింది అంటే తప్పక వాళ్ళు ప్రజలకు న్యాయం జరుగుతుందని భరోసా ఉండేది. ప్రజా సమస్యలను వెలికి తీసి  ప్రభుత్వానికి తెలిసేలా చేసే ప్రాసెస్ లో మీడియా ప్రముఖ పాత్ర పోషించేది. అలా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ  ప్రజల తరఫున ఎంతో అద్భుతంగా పనిచేసేది. అంతేకాదు మీడియా వ్యక్తులకు కూడా  సమాజంలో మంచి గుర్తింపు ఉండేది. అలాంటి మీడియా ప్రస్తుతం జైల్లో పడ్డ ఖైదీలా మారిపోయింది. నిజాలు చెప్పడం మర్చిపోయి  అబద్దాలని పదే పదే ప్రచారం చేస్తోంది. ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా సంస్థ కట్టుబానిసై  పనిచేస్తోందని ప్రజలు వాపోతున్నారు. దీంతో మీడియా వ్యక్తులను కూడా సమాజం గౌరవించలేని పరిస్థితుల్లోకి వస్తున్నారు. ఇలా బ్రష్టు పట్టిన మీడియా ఎప్పుడు మారుతుంది.. ఏ పార్టీకి ఆ పార్టీ మీడియా సంస్థ ఉంటే  ప్రజా సంస్థలు బయటకు వచ్చేదెప్పుడు? ప్రభుత్వం వాటిపై స్పందించేది ఎప్పుడు.?


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా సంస్థల్లో  కీలకమైన ఛానల్స్ ఉన్నాయి.  ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో వి6, టీవీ9, ఎన్టీవీ, టీవీ5,  హెచ్ఎంటీవీ, ఐ న్యూస్,  బిగ్ టీవీ,  టీ న్యూస్ లు ఉన్నాయి. ఇందులో కొన్ని కొన్ని చానళ్లు కొన్ని పార్టీలకు మాత్రమే మద్దతు పలుకుతూ పని చేస్తూ ఉంటాయి. ఆ పార్టీలు  తలలో పేను తీసిన హైలెట్ చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టీ న్యూస్. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఈ న్యూస్ ఛానల్  మరింత బలోపేతం అయింది. బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల ఇంట్లో నీళ్లు తాగినా,  ఆయన ఏ నీళ్లు తాగాడు, బాటిల్ ఖరీదు ఎంత, తెలంగాణ ప్రజలు కూడా అవే తాగండి అంటూ విపరీతమైన ప్రచారం చేస్తుందని సామాన్య ప్రజలు అయితే టీ న్యూస్ గురించి తెగ మాట్లాడుకునేవారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో  ప్రజా సమస్యల గురించి ఏనాడూ కూడా ప్రశ్నించలేదు ఈ టీవీ ఛానల్. దీంతో ప్రజల్లో ఈ ఛానల్ పై ఆదరణ కూడా తగ్గిపోయిందనీ కొంతమంది ప్రముఖులు అంటున్నారు. చాలామంది ప్రజలు టీ న్యూస్ అంటే బీఆర్ఎస్ అనుకూలమనే అపోహ కూడా ప్రజల్లో ఉంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..

 బీఆర్ఎస్ టీ న్యూస్ ఒక్కటేనా.?
 తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్  చానల్ అంటే చాలామంది ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది  టీ న్యూస్. అంతేకాకుండా  నమస్తే తెలంగాణ పేపర్. పార్టీ ఉన్నన్ని రోజులు ఈ న్యూస్ ఛానల్  ను తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్న వారంతా చూడాలనే ఒత్తిడి తీసుకువచ్చారని ప్రభుత్వం పడిపోయాక చాలామంది తమ బాధ బయటపెట్టారు.ప్రభుత్వ ఆఫీసుల్లో, రాజకీయ కార్యాలయాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పనిసరిగా ఇదే పేపర్ చదవాలని  చాలా వరకు నిబంధనలు పెట్టారట. కానీ ఈ పేపర్ లో ఏముంటుంది అంతా సోది తప్ప అని అపోహ వారందరికీ ఉండేది.  ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ చిన్న పని చేసిన దాన్ని హైలెట్ చేస్తూ చూపించి టీ న్యూస్ ఆదరణ కోల్పోయింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడైనా ఈ న్యూస్ ఛానల్ ప్రజల తరఫున పోరాడి ప్రజా సమస్యలు వెలికితీస్తుందా లేదంటే, టీ న్యూస్ అంటే పార్టీ ఛానల్ అని  నిరూపించుకుంటుందా అని చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: