ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో.. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.దీనికి ముఖ్య కారణం పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడమే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి..అధికారంలోకి వచ్చాయి తెలుగుదేశం, జనసేన అలాగే బిజెపి పార్టీలు. అయితే ఈ కూటమి జత కట్టడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్.


చాలా కష్టపడి మూడు పార్టీలను ఏకం చేసి అధికారంలోకి తీసుకువచ్చాడు  పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గ టికెట్ కూటమి పొత్తులో భాగంగా వచ్చింది. అయితే అక్కడి నుంచి పోటీ చేయాలని.. విజయం సాధిస్తానని ఎంతో ధీమాగా ఉన్నారు వర్మ.  కానీ పవన్ కళ్యాణ్ సీన్ లోకి రావడంతో... పిఠాపురం వర్మ ఆశలు అడి ఆశలు అయ్యాయి.


ఎన్నికల సమయంలో టికెట్ రాకపోవడంతో వర్మ బాగానే అలిగాడు. కానీ ఆ తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగడంతో కాస్త చల్లబడ్డాడు వర్మ. ఇక... ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ కు చాలా సహాయం అందించాడు వర్మ. ఎంతో కష్టపడి.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచేలా.. తన క్యాడర్ను సిద్ధం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే  ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారట..
దీంతో చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గెలిపించడంలో ఎంతో కృషి చేశాడు వర్మ.


అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మకు జనసేన నుంచి అనేక అవమానాలు వస్తున్నాయట. వర్మ ప్రాధాన్యత నియోజకవర్గంలో తగ్గేలా చేస్తున్నారట జనసేన నేతలు. ఈ నేపథ్యంలోనే తాజాగా పిఠాపురం వర్మ చేసిన వైరల్ గా మారాయి. నేను లోకల్... నా ప్రాధాన్యత ఎవరు తగ్గించలేరు అంటూ.. వర్మ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వర్మ చేసినట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మొదటినుంచి పవన్ కళ్యాణ్  అంటే వర్మకు పడడం లేదని  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: