( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) .

టాలీవుడ్ కలెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ స్వ‌యంగా మోహన్ బాబు ను రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఆ తర్వాత క్రమంలో వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఆయన బంధుత్వం కలుపుకున్నారు. రాజశేఖరరెడ్డి సోదరుడి కుమార్తె - మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత మోహన్ బాబు ఎక్కువగా వైయస్ ఫ్యామిలీతో ఉండేవారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేసిన మోహన్ బాబు అనంతరం వైసీపీలో చేరారు.


అయితే వైసీపీలో ఆయన ఎంతో కాలం ఇమడ లేకపోయారు. ఆ పార్టీ విధానాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు విమర్శలు కూడా చేశారు. తర్వాత మోడీని కూడా కలిశారు. ఆ తర్వాత రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అలాంటి మోహన్ బాబు ఇప్పుడు తన యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎవరిని పిలవలేని పరిస్థితి. ఈ వేడుకలకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కుని పిలుచుకు వచ్చారు. అందుకోసం కూడా మోహన్ బాబు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఓ టీవీ ఛానల్ పెద్దతో చెప్పించుకోవలసి వచ్చిందన్న ప్రచారం జరుగుతుంది.


మోహ‌న్ బాబు కు ఎప్పుడు తన వ‌ర్సిటీ టాప్ అనిపించు కోవాల‌న్న కోరిక ఉంటుంది. ఈ క్ర‌మంలోనే  మొదటి స్నాతకోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించాలనుకున్నా...  ఏపీ నుంచి పాలక పార్టీకి చెందిన వారెవరూ వచ్చేందుకు సిద్ధంగా లేర‌ట‌. ఇక త‌న తోటి సినిమా ఫ్రెండు పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించేందుకు ఆయన కూడా సిగ్గుపడి ఉంటారు. చంద్రబాబు రారు. అందుకే మ‌రీ తీసిక‌ట్టుగా స్నాత‌కోత్స‌వం ఉండ‌కూడ‌ద‌నే మోహ‌న్ బాబు చివ‌ర‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టిని తీసుకు వ‌చ్చార‌ని టాక్ ?  ఏదేమైనా ఇది మోహ‌న్ బాబుకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన షాకే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: