దువ్వాడ శ్రీనివాస భార్య వాణి తనపై చేస్తున్న ఆరోపణలు తనను ఎంతో బాధించాయని మాధురి చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే తన భార్య వాణికి విడాకులు ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. ఇందుకు న్యాయపరంగా ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ఆదివారం మాధురి కారులో ప్రయాణిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ముందుగా మాధురిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించారు.
ఈ సందర్భంగా మాధురి విలేకరులతో మాట్లాడారు. తన పిల్లలపై దువ్వాడ వాణికి చేసిన ఆరోపణలకు తాను బతకాల్సి వస్తుందని ... ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు వేరే గత్యంతరం లేదని తక్షణమే దువ్వాడ వాణిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల సహకారంతోనే దువ్వాడ వాణి తనపై ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆమె చెప్పారు. పలాస ఆసుపత్రిలోనూ మాధురి చాలాసేపు హైడ్రామాన్ని నడిపించారు. వై.ద్యుల సహకరించలేదు పైగా తనకు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు తన పిల్లలకు డీఎన్ ఏ టెస్టులు చేయాలని దువ్వాడ వాణి కోరారని వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.