తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. చాలామంది నేతలు గోడలు దుంకుతున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీకి చెందిన చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఎంపీ ఎన్నికల కంటే ముందు బిజెపిలోకి కూడా చాలామంది గులాబీ నేతలు వెళ్లారు. ముఖ్యంగా ముఖ్యంగా గులాబీ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

 

మరి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చి గులాబీ పార్టీ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో చాలామంది గులాబీ నేతలు కాంగ్రెస్లోకి రాకుండా ఆగిపోయారు. కాంగ్రెస్ లోకి వెళ్తే... ఎలాంటి హామీలు నెరవేర్చడం లేదని మెసేజ్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే.


దీంతో గులాబీ పార్టీలో ఉన్న నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అలాగే కోర్టులో పార్టీ ఫిరాయింపు కేసులు కూడా కేసీఆర్ పార్టీ వేసింది. ఏ క్షణమైనా జంపైన నేతలపై వేటు పడే ఛాన్స్ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... గులాబీ పార్టీని వదిలేసి బిజెపిపై కన్ను వేశారు రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

 

గత కొన్ని రోజులుగా బిజెపి పార్టీలో ఈటల రాజేందర్ కు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఓ వార్త ఉన్న సంగతి తెలిసిందే. ఈటల రాజేంద్ర కు ఎలాంటి పదవి రాకుండా బిజెపి  పాత నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇది గమనించిన రేవంత్ రెడ్డి.. ఈటల రాజేందర్ కు మంచి అవకాశం ఇస్తామని... కాంగ్రెస్లో చేరాలని ఆఫర్ పెట్టాడట.ఈ మేరకు... కొంత మంది  కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మంతనాలు జరుపుతున్నారట రేవంత్ రెడ్డి.మరి..ఈటల దీంతో ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: