( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

ప్రతిరోజు మీడియాలో వైసీపీ నుంచి కొందరు కీలక నేతలు పార్టీని వీడుతున్నట్టు వార్తలు చూస్తున్నాం. కిలారు రోశయ్య - పెండెం దొరబాబు - ఆళ్ల నాని - మద్దాలి గిరిధర్ రావు - రేపో మాపో క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక సైతం పార్టీ వీడుతోందని అంటున్నారు. వాస్తవంగా చూస్తే వీరి రాజీనామాలు అన్ని పెద్ద డ్రామాలు అని చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి తమ తమ నియోజకవర్గాలలో మరొక నేతను ఎదగకుండా చేసిన వీరందరూ పార్టీ కష్టకాలంలో ఉండడంతో కష్టపడాలి అని ... జేబులో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని పార్టీకి రాజీనామాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు.


అదే ఎన్నికలకు ముందు ఐదు ఆరు నెలల ముందు ఇదే నాయకులు తిరిగి పార్టీకి మూమెంట్ ఉందా లేదా అని చూసుకుని తిరిగి పార్టీలో చేరి టిక్కెట్లు దక్కించుకొని మళ్లీ ఎన్నికలలో పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉంది ... పార్టీ క్యాడర్ను కూడా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ టైంలో పార్టీ కోసం అండగా నిలబడాలి అంటే కష్టపడాలి ఎన్నో పోరాటాలు చేయాలి ... ఆర్థికంగా నష్టపోవాలి ... అవన్నీ చేయటం ఇష్టం లేని వైసిపి నాయకులు చాలా సింపుల్గా వైసీపీకి మాకు సంబంధం లేదు . . పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని చెబుతున్నారు.


అంటే ఎంచ‌క్కా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు తిరిగి పార్టీలో చేరి అప్పుడు మళ్ళీ మాజీ ఎమ్మెల్యేలు ... మాజీ మంత్రులం అంటూ టికెట్లు కొట్టేయాలన్న కుటిల ప్రయత్నమే.. వైసీపీకి రాజీనామా చేస్తున్న చాలామంది నేతలలో కనిపిస్తోంది. వైసీపీ క్యాడర్ ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: