దేశంలో ప్రస్తుతం ఎనిమిది నుంచి పది రాష్ట్రాల హవా కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుందట.. అదేమిటంటే ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్ లను సైతం మార్చాలి అంటూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈనెల 13వ తేదీన ఢిల్లీలో జరిగేటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గీ కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పిసిసి చీఫ్ లతోపాటు ఆయా రాష్ట్రాల ఇన్చార్జులతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నత స్థాయి పార్టీలు కూడా హాజరుకావాలని సూచించారట.


అయితే ఈసారి జరిగే కాంగ్రెస్ మీటింగ్ వెనుక చాలా కీలకమైన నిర్ణయాలతో పాటు పలు రకాల దిశా నిర్దేశాలను సైతం ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మరి కొన్ని నెలల్లో ఝార్ఖండ్, జమ్ము కాశ్మీర్ ,హర్యానా వంటి ప్రాంతాలలో అసెంబ్లీ ఎన్నికలు సైతం రాబోతున్నాయి. అలాగే వచ్చి ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయట. వీటితోపాటు మరికొన్ని రాష్ట్రాలలో పిసిసి చీఫ్ లను సైతం మార్చాల్సి  ఉన్నదట. అలాగే తెలంగా,ణ ఒడిస్సా వంటి ప్రాంతాలలో కొత్త నాయకత్వాన్ని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.


రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలని  భావిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏఏ రాష్ట్రాలలో ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలనే నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నారట. ఇప్పటికే ఇండియా కూటమి పక్షాలతో కాంగ్రెస్  పోత్తులు ఉన్నట్లుగా ప్రకటించింది. అలాగా లేని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఏపీ విషయానికి వస్తే ఏపీలో రాబోతున్న ఐదేళ్లలో పార్టీ బలోపేతం కావడం పైన ఒక చర్చ కూడా కొనసాగే అవకాశం ఉన్నదట. జనవరిలో ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల అని నియమించారు. అయితే ఈమె అనుకున్నంత స్థాయిలో ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. కేవలం జగన్ ఓడించడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు ఉపయోగపడిందని సమాచారం. కాంగ్రెస్ లో కూడా ఇప్పటికే చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు.. విరంతా కూడా షర్మిలని కలుపుకొని పోలేదని వాదన కూడా వినిపిస్తోంది. మరి ఇలాంటి అసంతృప్తులపై పిసిసి చీఫ్ గా షర్మిలను ఎన్నుకునేలా చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: