2024 ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన అద్భుతమైన హామీలలో అన్న క్యాంటీన్లు ఒకటి కాగా ఈ హామీ అమలు దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది. అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇండిపెండెన్స్ డే రోజున అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.
 
తొలి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని నారాయణ అన్నారు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెల 16వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు మిగతా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.  2024 ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన అద్భుతమైన హామీలలో అన్న క్యాంటీన్లు ఒకటి కాగా ఈ హామీ అమలు దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది. అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇండిపెండెన్స్ డే రోజున అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.

రాష్ట్రంలో 33 మున్సిపాలిటీలలో ఈ అన్న క్యాంటీన్లు మొదలుకానున్నాయని తెలుస్తోంది. హరే రామ హరే కృష్ణ సంస్థ అన్న క్యాంటీన్ల నిర్వహణను చూసుకోనుంది. తక్కువ ధరకే మూడు పూటలా పేదలకు మంచి ఆహారం అందించాలనే మంచి ఉద్దేశంతో అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. రోజువారీ కూలీలు, కార్మికులకు ఈ క్యాంటీన్ల ద్వారా మేలు జరగనుంది.
 
రాబోయే రోజుల్లో మరో 83 క్యాంటీన్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. కొన్నిచోట్ల కొత్తగా అన్న క్యాంటీన్ల నిర్మాణం జరుగుతోంది. అందువల్ల కొన్ని ప్రాంతాలలో అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. అన్న క్యాంటీన్లలో అందించే ఆహారం, ధరలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో 5 రూపాయలకు టీ కూడా కొనుగోలు చేయలేమనే సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో 5 రూపాయలకే భోజనం అందుబాటులోకి వస్తే మాత్రం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: