వైయస్సార్సీపి కాంగ్రెస్ నేత మహేంద్ర బాబు మీద దాడి చేసింది సాయి కృష్ణ మరియు అతని వర్గం తెలుగుదేశం పార్టీ నేత.. జాతర సందర్భంగా ప్రారంభించిన రగడ.. కత్తితో మెడ మీద వేస్తే ఆ కత్తి వెనక్కి తీసి వేయడానికి రానంతగా.. ఆ ఎముకలలో కూరుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి జరిగింది.. ఇంత వరకు కూడా వైసీపీ వాళ్లు తన్నులు తింటున్నారు, పారిపోతున్నారు ,పరుగులు పెడుతున్నారు,ఆస్తులు పోగొట్టుకుంటున్నారు , గాయాల పాలవుతున్నారు, జైలు పాలవుతున్నారు ఈ స్టేజ్ లో వినిపిస్తున్నాయి.
ఇలాంటి వాటి వల్ల గ్రామాలలో మండలాలలో కూడా ఉద్రిక్తత స్థాయికి తీసుకువచ్చేలా కనిపిస్తోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. తిరగబడి మళ్లీ వైసిపి అభిమానులు సాయి కృష్ణ వర్గం మీద దాడికి పాల్పడ్డారు. దీంతో సాయి కృష్ణ వర్గం కూడా తీవ్ర గాయాల పాలయ్యింది. పవిత్రమైనటువంటి శ్రీకాళహస్తి.. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం వద్ద కూడా ఇలాంటి తరహాలో పరిస్థితినీ ఆంధ్రప్రదేశ్ కు తీసుకు వెళుతున్నందుకు.. గర్వపడాల, బాధపడాల, సిగ్గుపడాల అనే విషయం ఎవరికి వారు ఆలోచించుకోదగ్గ విషయమని చెప్పవచ్చు.. రాజకీయపరమైనటువంటి దాడి ఇది అన్నటువంటిది ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన వారంలో కూడా వైసీపీ సర్పంచ్ మీద దాడి చేస్తున్న టిడిపి వర్గీయులకు పై తిరగబడిన సందర్భం కూడా మనం చూసే ఉన్నాము. మరి ఇలాంటి రాజకీయ కక్షలను కూటమి ప్రభుత్వం ఇకనైనా ఆపుతుందేమో చూడాలి.