తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను ప్రారంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ప్రారంభించి అమలు చేస్తున్నారు. వాటిలో ఒకటి మహాలక్ష్మీ పథకం. మరొకటి ఆరోగ్య శ్రీ పథకం.ఇదిలావుండగా  తెలంగాణ ఆడపడుచుల కోసం మరో తీపికబురు చెప్పడానికి రెడీ అయిందట రేవంత్ సర్కార్..  మహిళలంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండగ రోజు వాళ్లకు ఓ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైస్ చేయాలని ఫిక్సయ్యారట సీఎం.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ జరుపుకుంటూ ఉంటారు. రాష్ట్రంలో ఈ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. తెలంగాణ ఆడపడుచులంతా కలిసి ఊరి చివరన బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలుతుంటారు.అయితే ఈ ఏడాది బతుకమ్మ సంబరాలను రెట్టింపు చేసేలా సీఎం ప్లాన్ చేశారని సమాచారం. మహిళలకు ప్రభుత్వం తరపున చెరిగిపోని కానుక ఇవ్వబోతున్నారట సీఎం. గతంలో ఆడపడుచులకు బతుకమ్మ కానుక కింద.. చీరలు అందించారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో మరో కానుక రెడీ చేస్తున్నారట.

రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు ఈ ఏడాది ఒక తులం సిల్వర్ కాయిన్ ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కాయిన్ పై తెలంగాణ లోగో ఉంటుందని, రేషన్ షాపుల ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా వీటి పంపిణీ జరగనుందని తెలుస్తోంది.గతంలో బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని, అలాగే చీరల్లో నాణ్యత లేదని, వాటితో ఆడపడుచులు సంతృప్తిగా లేరన్న వాదనలు రావటంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రతి కుటుంబానికి ఒకే స్థాయిలో లబ్ది చేకూరేలా ఇలాంటి డెసీషన్ తీసుకున్నారని సమాచారం.మరోవైపు బతుకమ్మ పండుగ కానుకగా నేరుగా మహిళల అకౌంట్లలోనే ఎంతో కొంత మొత్తం జమ చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికైతే అతి త్వరలో ఈ విషయంపై ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన రానుందని, ఈ ప్రకటనతో మహిళలు ఖుషీ కావడం పక్కా అని అంటున్నాయి పొలిటికల్ వర్గాలు.అయితే వీటి పంపిణీ కోసం ఎలాంటి అర్హతలు ఉండాలన్న విషయంపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: