ఇటీవలె సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వర్మ అనే నేత టిడిపి పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈయన ఇండిపెండెంట్గా కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయట. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ స్థానాన్ని కూటమిలో భాగంగా తీసుకున్నారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కి అవసరం పడింది. ఇక కార్యకర్తలు అనుచరులు అయితే వర్మకు టికెట్ ఇవ్వకపోవడంతో చాలామంది నిరసన కార్యక్రమాలు చేసి హాట్ టాపిక్ గా మారేలా చేశారు.


కానీ ఆనాడు చంద్రబాబు ఇచ్చిన హామీతో వర్మ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి సాధించడానికి కూడా కారణమయ్యారని చెప్పవచ్చు. అయితే ఇలా కూటమి పార్టీ అధికారం చేపట్టిందో లేదో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీగా అయ్యాయి ఇందులో ఒకటి వర్మ ఇస్తారనుకోగా కానీ ఇతరులకు వెళ్లిపోవడం జరిగింది. అలాగే మరొకవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు కట్టుకొని ఇక్కడి నుంచే పోటీ చేసేలా ఇకమీదట ప్లాన్ చేశారట.


దీంతో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కూడా పిఠాపురం మీద చాలా ఫోకస్ పెట్టారు. ఇలా మొత్తం మీద పిఠాపురం జనసేన తో నిండిపోయింది.సొంత నియోజకవర్గంగా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ మార్చుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి రాజకీయ పరిణామాల వల్ల ఆరితేరిన వర్మ మీడియా ముందు మాట్లాడారు.. ఆయన పిఠాపురం నా అడ్డ అంటున్నట్లుగా ఒక సౌండ్ ని వినిపించారు.. విశాఖ నుంచి బయలుదేరి గోదావరి ఎక్స్ప్రెస్ కి ఎన్నో భోగీలు సైతం తగిలించుకొని వస్తూ ఉంటుంది అంటూ ఆయన పరోక్షంగా సెటైర్లు వేశారు. నేను ఇక్కడే పుట్టా ఇక్కడే ఉంటాను ఇక్కడే రాజకీయం చేస్తాను అంటూ కూడా తెలియజేశారు వర్మ నేను పక్కా లోకల్ అని గట్టిగానే సెటైర్ వేశారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజలతో మమేకమవుతూనే ఉంటానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి తోడుగా ఉంటానని కూడా తెలిపారు వర్మ.. ఎవరో వచ్చి పిఠాపురంలో తన హవా తగ్గించాలనుకుంటే అది కుదిరే పని కాదని కూడా తేలిచ్చి చెప్పేశారు వర్మ. వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు జనసేన పార్టీకి గట్టిగానే తగిలినట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: