* హైదరాబాద్‌ - బెంగళూరు హైవేతో భూముల ధరలకు రెక్కలు
* 4 లైన్స్‌ నుంచి 12 లైన్స్‌ గా విస్తరించేకు కేంద్రం నిర్ణయం
* హైదరాబాద్-ఏపీ మధ్య తగ్గనున్న దూరం
* రాయలసీమ ప్రాంతానికి లాభం


భారతదేశంలో చాలా పట్టణాలు ఉన్నాయి.  అలాంటి వాటిలో హైదరాబాద్ అలాగే బెంగళూరు నగరాలు చాలా ఫేమస్ అయ్యాయి. ఈ రెండు రాజధానులు కూడా మెట్రో నగరాలే. అంతేకాదు బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాలలో... అనేక ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీలు చాలానే ఉన్నాయి. లక్షల మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి ఈ నగరాలు.


అయితే అలాంటి హైదరాబాద్ అలాగే బెంగళూరు  మధ్య రవాణా... విపరీతంగా ఉంటుంది. ఇక ఈ రెండు నగరాల మధ్య... తక్కువ సమయంలో వెళ్లేలా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ రెండు నగరాల మధ్య ఉన్న... 44 నేషనల్ హైవే ను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.  ఫోర్ లైన్స్ ఉన్న ఈ రోడ్డును 12 వరుసలు చేసేలా రంగం సిద్ధం చేసింది.


ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ తగ్గడమే కాకుండా తక్కువ టైంలో... ఈ రెండు నగరాల మధ్య ట్రావెలింగ్ కూడా ఉంటుంది. ఈ రోడ్డు డెవలప్ అయితే రాయలసీమ ప్రాంతం కూడా... అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి పొడవు 576 కిలోమీటర్లు. ఇందులో 210 కిలోమీటర్ల విస్తీర్ణం తెలంగాణలోనే ఉంటుంది. ఏపీలో 260 కిలోమీటర్లు ఉంటుంది. ఇక కర్ణాటకలో 106 కిలోమీటర్ల పొడవు ఈ రహదారి ఉంటుంది.


నాలుగు లైన్లు ఉన్న ఈ రహదారిని 12 లైన్లు చేస్తే తెలంగాణలో కూడా భూముల ధరలకు రెక్కలు వస్తాయి. తెలంగాణలో ఉన్న ఈ రహదారి చుట్టూ భూముల ధరలు పెరుగుతాయి. అటు ఏపీకి కూడా త్వరగానే చేరుకోవచ్చు.  కర్ణాటక ఇటు ఏపీలో కూడా భూములు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ మరియు అమరావతి మధ్య దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: