* కొత్త రోడ్లతో తగ్గుతున్న ప్రయాణం దూరాలు

* ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేతో వాహనదారులకు ఎంతో ప్రయోజనం  

* త్వరలోనే నిర్మాణం పూర్తయ్యే అవకాశం

( ఏపీ, తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

భారత్ మాల ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం తగ్గిస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ కంట్రోల్ హైవే ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఇది సూర్యాపేట-దేవరపల్లి మధ్య నిర్మించాలని భావించారు కానీ అప్పటికే ఖమ్మం-సూర్యాపేట మధ్య హైవే నిర్మాణం మొదలవ్వడంతో ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారిని కేంద్రం మంజూరు చేసింది. ప్రస్తుతం సుమారు రూ.4,500 కోట్లతో ఈ రహదారి నిర్మాణ పనులు 5 భాగాలుగా నిర్మిస్తున్నారు.

ఈ రహదారి నిర్మాణం జరుగుతున్న సమీప గ్రామాల ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి . ఈ రహదారికి తమ గ్రామాల నుంచి ప్రవేశించడం జరుగుతుందా లేదా అని. ప్రస్తుతం మన జిల్లాలో వున్న జాతీయ రహదారులు బ్రౌన్‌ఫీల్డ్ రహదారులు. ఈ రహదారుల నుంచి సమీప గ్రామాలకు జాతీయ రహదారితో అనుసంధానం ఉంటుంది. కానీ గ్రీన్‌ఫీల్డ్ రహదారి విషయం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నందు మాత్రమే ఇంటర్ చేంజింగ్ ఉంటుంది.

ఢిల్లీ - ఆగ్రా మధ్య నిర్మించిన యుమన ఎక్సప్రెస్ వే, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తరహాలో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఉంటుంది. ఈ రహదారి మొత్తం ఐరన్ ఫెన్సింగ్ కవచం ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వాహనాలు ఇష్టానుసారం ఈ రహదారిలోకి ప్రవేశించలేవు. మొత్తం 162 కిలోమీటర్లు ఉండే రహదారిలో 8 నుండి 10 వరకు మాత్రమే ఇంటర్ చేంజ్ పాయింట్స్ రానున్నాయి. అందులో కొన్ని పాయింట్లు చింతలపూడి-ఎర్రగుంటపల్లి మధ్య రెచర్ల వద్ద, జంగారెడ్డిగూడెం - ఏలూరు రహదారిపై పుట్లగట్లగూడెం వద్ద, కొయ్యలగూడెం - నల్లజర్ల రహదారిపై పొంగుటూరు వద్ద, దేవరపల్లి వద్ద ఉండనున్నాయి.

ప్రతి ఇంటర్ చేంజ్ వద్ద నాలుగు టోల్‌గేట్లు

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కార్లు, 100 కిలోమీటర్ల వేగంతో భారీ వాహనాలు ప్రయాణించే విధంగా ఈ హైవే నిర్మిస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తి అయితే సూర్యాపేట నుంచి రాజమండ్రి కారు ప్రయాణం కేవలం 3 గంటలుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సూర్యాపేట ఖమ్మం హైవే 51 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 35 నిముషాలు. దీన్నిబట్టి హైదరాబాద్-వైజాగ్ మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గడమే గాక ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తరహా టోల్ ప్లాజాలు

ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రధాన రహదారిపై ఎటువంటి టోల్ ప్లాజాలు ఉండవు. ఇంటర్ చేంజ్ వద్ద ఏర్పాటు చేసే సర్వీస్ రోడ్డులపై మాత్రమే టోల్ ప్లాజాలు ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్-వైజాగ్ వెళ్లే కార్ ఖమ్మం ఇంటర్ చేంజ్ సర్వీస్ రోడ్ నందలి టోల్ ప్లాజాలో రిజిస్టర్ అయ్యి దేవరపల్లి వరకు నిర్విరామంగా ప్రయాణం చేస్తుంది. దేవరపల్లి వద్ద సర్వీస్ రోడ్డులోకి ప్రవేశించినప్పుడు వచ్చే టోల్ ప్లాజా వద్ద మొత్తం ప్రయాణ దూరానికు టోల్ వసూల్ జరుగుతుంది. జంగారెడ్డిగూడెం-హైదరాబాద్ వెళ్లే వారు పుట్లగట్లగూడెం వద్ద ఇంటర్ చేంజ్ టోల్ ప్లాజా వద్ద రిజిస్టర్ చేసుకుని ఖమ్మం ఎగ్జిట్ వద్ద టోల్ చెల్లించాలి. ఈ రహదారిపై ప్రయాణించే ప్రతి వాహన వివరంగా రికార్డు కావడమే కాక టోల్ నుంచి తప్పించుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇది ఎక్స్‌ప్రెస్ వే కాబట్టి దీనిపై ట్రాక్టర్లు, ఆటోలు వంటి వాటిని అనుమతించరు.

మరింత సమాచారం తెలుసుకోండి: