*  అమరావతి ముఖచిత్రమే మార్చనున్న ఓఆర్ఆర్ ప్రాజెక్ట్.!

* ప్రాజెక్ట్ కేవలం మాటలకే పరిమితమా.? చేతల్లో చూపిస్తారా..?

* అమరావతి అభివృద్దే చంద్రబాబు భవిష్యత్తుకు కీలకంగా మారేనా..?

(అమరావతి-ఇండియా హెరాల్డ్ ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకంగా మారిన అంశం రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని, ప్రపంచంలోనే మెరుగైనా నగరాల్లో ఒకటిగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఎంతో శ్రమించారు.స్వయంగా విజనరీ అయిన చంద్రబాబు ఏపీని కొత్తగా డిజైన్‌ చేయటానికి ఎన్నో ప్రణాళికలు రచించారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థికంగా వెనుకబడిన ఏపీని గాడిన పెట్టటానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రాజెక్టులకు రూప కల్పన చేశారు. అందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది అమరావతి చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించి పనులు మొదలు పెట్టాలనుకునేలోగా రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. వైసీపీ పాలనలో అమరావతి అంశమే మూలన పెట్టారు. దీంతో అనివార్యంగా ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు మసకబారింది.ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గాడి తప్పిన రాష్ట్ర పాలనను అదుపు చేస్తూ ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెంటిని బాలన్స్ చేస్తూ దూసుకుపోవడంలో ప్రణాళికలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు.దాంట్లో భాగంగానే ఓఆర్ఆర్ స్టార్ట్ చేసి దాని పూర్తి చేయడం పై వ్యూహన్ని పన్నుతున్నారు.ఇటీవల బాబు పీఎం మోదీని కలిసి ప్రాజెక్ట్ విషయంపై చర్చించడంతో పీఎం సానుకూలంగా స్పందించి పాతిక వేల కోట్లు రూపాయలు ఏపీ కోసం కేటాయించారు.ఈ ప్రాజెక్ట్ కనక పూర్తి అయితే అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాలు కలిసిపోయి ఓ మెగాసిటీగా మారిపోయే అవకాశముంది.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ఔటర్ రింగ్ రోడ్డును 6 లైన్లతో ఎక్స్‌ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. రాజధాని అమరావతిలో లాజిస్టిక్, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పినట్లు ఈ క్రమంలోనే 25,000 కోట్ల రూపాయల విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టును అమరావతికి మంజూరు చేశారని తెలిపారు.2018లో ఈ ప్రాజెక్టును మొదటిసారి ప్రతిపాదించినప్పుడు అంచనా వ్యయం 17వేల కోట్లు. ఐదేళ్లుగా దీన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇప్పుడు అంచనా వ్యయం పెరిగి అది కాస్త 25వేల కోట్లకు చేరుకున్నదని తెలుస్తుంది. ఏదేమైనా మన ఎంపీలు దీనికోసం పార్లమెంట్లో పోరాడైన సరే ఎక్సట్రా నిధులు కేటాయింపు జరిగే విధంగా ముందుకు సాగాలని కోరుతున్నారు.ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందినప్పటినుండి రాష్ట్రంలో జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.ఈ ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తైతే అమరావతి ముఖచిత్రమే మారిపోతుంది. ఇదే ఎజెండాతో చంద్రబాబు కూడా పని చేస్తున్నారు.ప్రతిపాదిత ఓఆర్‌ఆర్‌ పరిధిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మొత్తం జనాభా 37 లక్షలు ఉంటుందని అంచనా. ఓఆర్‌ఆర్‌కి పూర్తిగా లోపల ఉన్నవి, ఓఆర్‌ఆర్‌ వెళ్తున్న మండలాలు 40 ఉన్నాయి. దీనివల్ల విజయవాడ, గుంటూరులతో పాటు తెనాలి, మంగళగిరి, గుడివాడ, గొల్లపూడి, నూజివీడు, కొండపల్లి, పొన్నూరు, సత్తెనపల్లి, ఉయ్యూరు ప్రాంతాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా శరవేగంగా పురోగతి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఓఆర్‌ఆర్‌ నిర్మాణం మొదలైతే... రెండు మూడేళ్లలో పూర్తయితే రాజధాని అమరావతి సమగ్రంగా అభివృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: