ఈ ప్లేస్ లో మళ్లీ భర్తీ చేయడానికి వారందరికీ ఏదో ఒక సహాయం చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీల కారణంగా రాష్ట్రంలో పెద్దగా ఉపయోగం ఉండదు అన్నట్టు ఆయన ఎన్నికలను పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు శ్రీనివాసరావు అలియాస్ వంశీకృష్ణ యాదవ్‌పై అనర్హత వేటుపడింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మండలి చైర్మన్ ఎమ్మెల్సీ పదవికి అనర్హుడయ్యారు. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ కోసం పోటీ పడాల్సి వస్తోంది . కాగా వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ మాత్రం ఈ ఎలక్షన్లలో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యింది. బొత్స ఇక్కడ ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి ఎంత అంటే అంత డబ్బులు ఖర్చు పెట్టగలరు.
అంతే కాకుండా అందరినీ కొఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ గెలవ గలరు కూడా. టీడీపీ బరిలోకి దిగాలంటే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పైగా దాన్ని అనవసర ఖర్చుగా చంద్రబాబు చూస్తున్నారు. మళ్లీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ ఎన్నికల కోసం పనిచేయాల్సి వస్తుంది. అందుకే దీని నుంచి తట్టుకోవడానికి ఆయన ముందు చెప్పారు