గత కొద్ది రోజుల నుంచి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన చాలా ఉత్కంఠత రేపింది.. అయితే ఎట్టకేలకు ఈ పోటీకి టిడిపి పార్టీ దూరంగా ఉండడంతో కేవలం బరిలో ఇద్దరే ఉన్నారు.. వైసీపీ నుంచి మాజీమంత్రి బొత్స సత్యనారాయణ మరొక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి షఫి ఉల్లా నామినేషన్ల సైదులు దాఖలు చేయడం జరిగింది.అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా తన నామినేషన్ వెనక్కి  తీసుకుంటారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.బొత్స ఏకగ్రీవం అయ్యేలా చేస్తారా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉన్నది.


లేకపోతే ఎన్నిక అనివార్యం కానుంది మరొకవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు కూడా నీన్నటితో ముగిసినట్లు తెలుస్తోంది. ఈనెల 30వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. అయితే ఎమ్మెల్సీ ఉపా ఎన్నికల నుంచి టిడిపి పార్టీ కూటమిపరంగా దూరం అయ్యింది.. అందుకు కారణం కూటమి పక్షాన బలం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. జీవీఎం కార్పొరేటర్లు, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, నర్సీపట్నం, జడ్పిటిసి ఎంపీటీసీ సభ్యులు ఇలా ఇందులో కొంతమంది ఓటర్లు ఉన్నారు.



 వీరందరిలో 60% పైగా వైసీపీ పార్టీ నుంచి గెలిచిన వారి ఉండడం గమనార్హం. అయితే ఒకవేళ పోటీ జరిగితే గెలిపిస్తామని కొంతమంది టీడీపీ నేతలు ముందుకు వచ్చినా కూడా ఎందుకో కూటానికి ప్రభుత్వం ఈ విషయం పైన వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బొత్స మొదటి రోజు నుంచి దూకుడుగా ప్రదర్శించారు నియోజకవర్గాల వారీగా కూడా ఆత్మీయంగా అన్ని సమావేశాల పేరుతో న్యాయకత్వాన్ని సమీకరించడం వల్ల కచ్చితంగా ఆయన విజయం ఖాయమని భావించడంతో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు వైసిపి వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా నామినేషన్ ఉపసంహరించుకుంటారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: