వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి పైన గత కొద్దిరోజులుగా చాలా మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయిన సందర్భాలు కూడా మనం చూశాము. ఆ సమయంలో ఇలాంటి వార్తలు రాసే వారిని వదిలిపెట్టనంటూ కూడా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలోనే తాను అన్నంత పని చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ సాయి రెడ్డి వ్యక్తిగత జీవితం పైన పలు రకాల రూమర్స్ సృష్టించిన 9 మీడియా సంస్థలకు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఒకసారిగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఆయన పైన ప్రచారం చేస్తున్న కథలను వెంటనే తొలగించాలని ఆర్డర్లు కూడా వేసింది ఢిల్లీ హైకోర్టు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆధారాలు లేని  కథనాలు అసలు ప్రసారం చేయకూడదని ఇవ్వకూడదని కూడా తేల్చి చెప్పేసింది.. ముఖ్యంగా ఈటీవీ, ఆర్టివి, టీవీ5 మహాన్యూస్, ఆంధ్రజ్యోతితో పాటు తొమ్మిది సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సైతం ఉత్తర్వులను జారీ చేసిందట
విజయ సాయి రెడ్డి ఇచ్చినటువంటి నిరాధార కథనాలను సైతం వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు సూచించింది. వీటన్నిటిని వెంటనే బ్లాక్ చేయాలని ఇకపై ఇలాంటి ఆధారాలు లేని కథనాలను సైతం ఎవరూ కూడా ప్రసారం చేయవద్దు అంటూ కోర్టు సూచించింది.


తనకు సంబంధం లేని విషయంలో తన పేరును కావాలని ప్రస్తావిస్తున్నారని కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా వ్యక్తిగత విషయం పైన పలు రకాల కథనాలు రాయడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా విజయ్ సాయి రెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా 10 కోట్లకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా కూడా వేసినట్లు తెలుస్తోంది. ఈ పిటీషన్ పైన విచారణ జరిపిన తర్వాత హైకోర్టు విజయసాయిరెడ్డికి సైతం అనుకూలంగా ఉత్తర్వులను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పైన చేసిన పలు కథనాలను వెంటనే డిలీట్ చేయాలని పలు టీవీ చానల్స్ కు కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: