•నారా వారి రెడ్ బుక్.. ఇబ్బందుల్లో పడ్డ వైసిపి

•అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఇబ్బందులు మొదలు

•వైసీపీ ప్రభుత్వానికి తప్పని తిప్పలు..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

2024 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి ఊహించిన విధంగా కూటమిగా ఏర్పడి, ఏకంగా 164 సీట్లు సొంతం చేసుకుంది. వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలలో పోటీ చేసి కేవలం 11 స్థానాలకే పరిమితమవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. దీనికి తోడు అధికారంలోకి టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పవచ్చు.

ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు టీడీపీ నేతలు ఇబ్బందులు పడ్డారని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో టిడిపి నేతలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు . ముఖ్యంగా నారా లోకేష్ ను చాలామంది టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. పప్పు అని, ఏమి చేత కాని వాడు అని చాలా రకరకాలుగా ఆయనను విమర్శించిన విషయం తెలిసిందే అయితే ఈసారి ఎవరు ఊహించని విధంగా 94 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది అందరిని ఆశ్చర్యపరిచారు.  సుద్ధ పప్పు అనిపించుకున్న వాడు సూపర్ హీరో అయిపోయాడు.

అయితే ఆ సమయంలో నారా లోకేష్ ఎవరెవరి చేత ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరినీ రెడ్బుక్ అనే ఒక బుక్ ఏర్పాటు చేసి,  ఆ బుక్ లో పేర్లు నమోదు చేశారు.  ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. అన్నట్టుగానే ఆ రెడ్ బుక్ లో ఉండే పేర్లు ఇప్పుడు ఇరకాటంలో పడ్డాయని చెప్పవచ్చు. ఇక రెడ్ బుక్ అన్నట్టుగానే ఆ రెడ్ బుక్ లో పేరు నమోదైన వల్లభనేని వంశీ కూడా ఇటీవల జైలు పాలయ్యారు. అంతేకాదు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని చాలామంది పేర్లు ఇందులో ఉన్నాయట.  వీరందరికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోని ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నారావారి రెడ్ బుక్  వైసిపి నేతలకు ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: