ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరికీ ఏపీ సర్కార్ ఒక గుడ్ న్యూస్ ని తెలియజేసింది. అదేమిటంటే పారదర్శకంగానే ఉద్యోగ బదిలీలు చేపట్టాలని పలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు ఏళ్ల పాటు గడువు పూర్తి అయిన వారందరినీ కూడా బదిలీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుందట.అయితే బదిలీలను వెంటనే చేయాలనీ కూడా ఆదేశాలను జారీ చేసింది.. ఈనెల ఆఖరి లేదా సెప్టెంబర్ మొదటి వారం కల్లా పూర్తి అవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.


ఈరోజు రేపు దీనిపైన జీవో కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. సచివాలయం నుండి గ్రామ సచివాలయం వరకు అందరి ఉద్యోగులను బదిలీ చేయాలని ముఖ్యంగా ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న ఉద్యోగులకు స్థానా చలనం కల్పించాలి అంటూ ప్రభుత్వం కూడా పలు రకాల నిర్ణయాలు తీసుకున్నదట. ఈసారి బదిలీలలో సైతం రూరల్ ఏరియాలో, అంగవైకల్యం, స్పోజ్ కేటగిరి ఉన్నవారికి వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందట. ఈ బదిలీలలో ఎక్కడా కూడా  పారదర్శకత లోపించకూడదనే విధంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందట.


అలాగే ఐదు సంవత్సరాలు పూర్తి చేయడానికి కటాఫ్ తేదీన కూడా ప్రకటించారు.. జూలై31- 2024  వరకు తేదీని సైతం ప్రకటించారు. ఈ బదిలీలను సైతం వేగవంతంగా పూర్తి చేయాలని దిశా నిర్దేశాలను కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు. బదిలీలు అయిపోగానే ప్రభుత్వం చేపట్టేటువంటి రెవెన్యూ సదస్సులతోపాటు, కొన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలను కూడా వేగవంతంగా చేసేలా చూడబోతున్నారట. ఈ బదిలీల కోసమే రెవెన్యూ మీటింగ్లను కూడా వచ్చే నెలకి వాయిదా వేయనునున్నట్లుగా తెలియజేసింది ప్రభుత్వం. మరి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జీవోను సైతం ఎప్పుడు జారీ చేస్తారో చూడాలి మరి. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసి వారినీ బదిలీలను సైతం చేసినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: