ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మరొకసారి తన గొప్ప మనసుతో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ రోజున అన్న క్యాంటీన్లు ఓపెనింగ్ సైతం చేయబోతున్నారు. దీంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపు నుంచి ఆమె ఏకంగా కోటి రూపాయల సైతం భారీగా విరాళాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆ చెక్కును సైతం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేసినట్లు తెలుస్తోంది. పేదల కడుపు నింపేందుకే అన్నా క్యాంటీన్లను సైతం ఏర్పాటు చేయడం ఒక గొప్ప విషయం అంటూ ఆమె తెలియజేసింది. పేదవారికి కూడు గూడు గుడ్డ అనేది ఎన్టీఆర్ నినాదం అంటూ తెలియజేసింది నార భువనేశ్వరి.


రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఈ రోజున ప్రారంభించబోతోంది. గుడివాడలో ఉండే అన్న క్యాంటీన్ ను స్వయంగా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టబోతున్నారు అలా జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం అన్న క్యాంటీన్లను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అన్న క్యాంటీన్లలో కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ లంచ్ డిన్నర్ వంటివి అందిస్తున్నారు. వీటన్నిటిని హరే కృష్ణ మూవ్ మెంట్ సంస్థలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది ఏపీ సర్కార్.


ఇక అన్న క్యాంటీన్లు పెంచడానికి దశలవారీగా ప్రయత్నం చేస్తామని కూడా తెలుపుతున్నారు. ఈ రోజున ఏకంగా 99 అన్న క్యాంటీన్లను ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చేనెల మరకత 99 అన్న క్యాంటీన్లను సైతం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు వైట్ రైస్, కూర, సాంబార్ పెరుగు పచ్చడి పప్పు వంటి వాటిని చేయబోతున్నారట వారంలో ఏదైనా ఒక రోజు స్పెషల్ రైస్ ని చేయబోతున్నారట.. ఇక టైమింగ్ విషయానికి వస్తే ఉదయం టిఫిన్ 7 నుంచి 10 గంటలకు.. మధ్యాహ్న భోజనం 12:30 గంటల నుంచి మూడు గంటల వరకు. రాత్రి భోజనం సమయం 7:30 నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుంది సండే హాలిడే.

మరింత సమాచారం తెలుసుకోండి: